తమ్ముడు సినిమాకు అక్క నిర్మాతనా..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా వచ్చిన ఏకైక అమ్మాయి నిహారిక.. ప్రస్తుతం ఈ అమ్మాయికి సరైన హిట్టు లేదు.. ఇటీవల కాలంలో పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. నిహారిక విడాకుల తర్వాత నిర్మాతగా మారింది కొన్ని ఎపిసోడ్ చిన్న సినిమాలు నిర్మాతగా నిహారిక వ్యవహరించింది.. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి నిర్మాతగా మారుతుందని సినిమా ఇండస్ట్రీలో టాక్.. మరి అమ్మాయి ఎవరు తెలుసుకుందాం..

మరి ఆ అమ్మాయి ఎవరో కాదు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినికి సినిమాలంటే ఆసక్తి వుంది అని, త్వరలో ఆమె నిర్మాతగా మారే అవకాశం ఉందని కూడా చెపుతున్నారు. ఎందుకంటే ఆమె ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా ఎలా జరుగుతోంది, ఎలా వస్తోంది అనే విషయాలని సెట్స్ కి వెళ్లి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం జరిగిందని అంటున్నారు. అంతే కాదు కథలు వింటున్నారని, త్వరలోనే సినిమా ఉండొచ్చు అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

ఇప్పుడు (Balakrishna) బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి సినిమా షూటింగ్ జరుగుతోంది, ఈ సినిమా గురించి కూడా తేజస్వి ఆసక్తి చూపించారని సినిమా ఎలా వస్తోంది, ఎలా జరుగుతోంది అనే విషయాలు తెలుసుకుంటున్నారని ఒక టాక్ నడుస్తోంది. ప్రొడక్షన్ విషయాలని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని, ఇవన్నీ నిర్మాతగా తెలుసుకోవలసిన అవసరం ఉందని అందుకనే ఆసక్తి కనపరచారని కూడా అంటున్నారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా త్వరలోనే ఆరంగేట్రం చేయనున్నాడని, ఆ సినిమాకి నిర్మాతగా తేజస్విని వ్యవహరించవచ్చని కూడా అంటున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus