లేవలేని స్థితిలో ఆ స్టార్ హీరో..ఆందోళనలో అభిమానులు!

చెప్పాలంటే ఇది శీతాకాలం. కానీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఎండ కూడా వేసవికాలంలో ఉన్నట్టు ఉంటుంది. ఇలా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వలనో ఏమో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఓ స్టార్ హీరో కూడా చేరాడు. ప్రస్తుతం అతను లేవలేని స్థితిలో ఉన్నాడట. అతను మరెవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం అతను డెంగ్యూతో బాధపడుతున్నాడట.

ప్రస్తుతం తన ఇంట్లోనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు అని సమాచారం. ఈ కారణంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. అలాగే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 16 ను కూడా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సల్మాన్ హోస్ట్ చేసే పొజిషన్ లో లేడు కాబట్టి.. అతని స్థానంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ దర్శకుడు అయిన కరణ్ జోహార్ ను తీసుకున్నారు.

సల్మాన్ ఖాన్ కోలుకునే వరకు ఇతను కొన్ని ఎపిసోడ్లకు హోస్ట్ చేయనున్నాడు. కరణ్ జోహార్ కు హోస్ట్ గా అనుభవం ఉంది. అతని హోస్టింగ్ ను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉన్నారు. కాబట్టి.. టి.ఆర్.పి విషయంలో డౌట్ పడనవసరం లేదు అని బిగ్ బాస్ యూనిట్ భావిస్తుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus