Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో ఫైనల్..!

చెప్పాలంటే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు కాబట్టి మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వచ్చి ఉండాలి. నిజానికి 3 అప్డేట్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మరియు.. కృష్ణ గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అయిన పాత్రికేయ మిత్రులు బి.ఎ.రాజు గారు మరణించడంతో వాటిని పోస్ట్- పోన్ చేశారు.అయితే ‘సర్కారు వారి పాట’ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే..పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో విలన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్లు సునీల్ శెట్టి, అనిల్ కపూర్ వంటి వారితో పాటు కన్నడ ఇండస్ట్రీ నుండీ సుదీప్, ఉపేంద్ర ల పేర్లు కూడా వినిపించాయి. ఇక మొన్నటికి మొన్న తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతూ అరవింద్ స్వామి, మాధవన్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ పేరు వినిపిస్తోంది. దాదాపు ఇతను ఫిక్సయినట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే ఇదే విషయం పై చిత్ర యూనిట్ సభ్యులను ఆరాతీయగా ఇంకా ఎవ్వరినీ ఫిక్స్ చేయలేదని చెబుతున్నారు. మహేష్ మాత్రం అర్జున్ లేదా మాధవన్ ల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు వారు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో విలన్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుందని… అందుకే దర్శక నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని వారు తెలియజేసారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus