Jawan: షారుఖ్‌ ‘జవాన్‌’లో మరో హీరో నిజమే.. ఎవరో క్లారిటీ వచ్చేసింది!

షారుఖ్‌ ఖాన్‌ ‘జవాన్’ సినిమా షూటింగ్‌ సగం పూర్తయిందో లేదో.. ఈ సినిమాలో మరో హీరో ఉన్నాడు అంటూ.. ఓ పుకారు మొదలైంది. ఆ వెంటనే ఆ హీరో అల్లు అర్జున్‌ అంటూ ఓ పుకారు మొదలైంది. దీనిపై చాలా రకాల క్లారిటీలు వచ్చాయి, చాలామంది క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే ఎంతకీ ఆ పుకార్లు ఆగలేదు. కారణం అందులో మరో స్టార్‌ హీరో ఉన్నాడనే వార్త బలంగా వినిపించడమే. అయితే ఇప్పుడు వాటికి ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇన్ని క్లారిటీలు ఇచ్చినా ఆ పుకారు ఇప్పుడు ఎలా ఆగింది అనుకుంటున్నారా?

ఆ సినిమాలో నటించన ఆ స్టార్‌ హీరో ఎవరు అనే విషయంలో స్పష్టత వచ్చేసింది. ఈసారి పుకారు కాదు.. ఆ సినిమాకు అంటే ‘జవాన్‌’కు పని చేసిన టీమ్‌ నుండి ఒకరు చెప్పారు. ఈ చిత్రానికి యాక్షన్‌ సీన్స్‌లో వర్క్ చేసిన స్టంట్ డైరెక్టర్ యానిక్ బెన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. అందులో భాగంగానే విజయ్‌ నటించిన విషయాన్ని రివీల్ చేశారు. దీంతో ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్‌ లేనట్లే అని నిర్ణయానికి వచ్చేయొచ్చు.

‘పఠాన్’ సినిమాతో బాలీవుడ్‌ను, తన కెరీర్‌ను ట్రాక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు షారుఖ్‌ ఖాన్‌. ఇప్పుడు ఆ విజయానికి కొనసాగింపుగా ‘జవాన్’ సినిమాతో రాబోతున్నాడు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాను సెప్టెంబరు 7న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు విజయ్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు అనేసరికి అట్లీ ఏమైనా సినిమాటిక్‌ యూనివర్స్‌ రెడీ చేస్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే ‘జవాన్‌’ సినిమా టీజర్‌లో ‘తెరి’ రిలేటెడ్‌ సీన్స్‌ కొన్ని కనిపిస్తున్నాయి.

‘జవాన్‌’ను (Jawan) హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో విలన్‌గా విజయ్‌ సేతుపతి నటించగా.. నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి అమరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇలా మొత్తంలో ‘జవాన్‌’ అరవ ‘జవాన్’ అయ్యింది అనే కామెంట్లు కూడా వచ్చాయి. మరి సినిమా ఫలితం ఎలా వస్తుందో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus