Custody: ఆ స్టార్ హీరో నో చెప్పడంతో ‘కస్టడీ’ లో అరవింద్ స్వామిని తీసుకున్నారట!

అక్కినేని నాగచైతన్య హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటించింది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ లో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. మే 12న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ వంటి స్టార్లతో పాటు విలన్ గా అరవింద్ స్వామి నటించాడు. రాజు అనే పాత్రలో చాలా టెరిఫిక్ గా నటించడంతో పాటు అక్కడక్కడా తన డైలాగ్స్ తో నవ్వించాడు అని కూడా చెప్పాలి.

అరవింద్ స్వామి పాత్రను బేస్ చేసుకునే ‘కస్టడీ’ కథ మొత్తం నడుస్తుంది. అందుకే అతని నటనకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఈ పాత్రకు అరవింద్ స్వామి ఫస్ట్ ఛాయిస్ కాదట. మరో స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే .. అరవింద్ స్వామి వద్దకు వెళ్లిందట. ఆ స్టార్ మరెవరో కాదు మాధవన్. మొదట విలన్ గా అతన్నే అనుకున్నారట.

మాధవన్ సంప్రదించి కథ చెప్పగా.. బాగుందని కూడా చెప్పాడట. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక అతను ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. ఈ క్రమంలో అరవింద్ స్వామిని సంప్రదించగా అతను ఓకే చెప్పినట్లు స్పష్టమవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus