Malaika Arora: మలైకాతో పెళ్లిపై యంగ్ హీరో రియాక్షన్!

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మలైకా అరోరా 48 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్ తో నిత్యం సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంటాయి. కొన్నేళ్ళ క్రితం సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా అరోరా ఎన్నో ఐటెం సాంగ్స్ తో కూడా మెప్పించింది. అయితే ఈ బ్యూటీకి 20 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు.

అయితే గత కొంత కాలంగా మలైకా యువ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ లాక్ డౌన్ లో కూడా ఒకే ఫ్లాట్ లో ఉన్నారు. అప్పుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి సంబంధించిన కథనాలు అయితే గత రెండేళ్లుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎక్కడ అనే విషయాలపై మాత్రం ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇటీవల మలైకా అరోరా ఒక ఇంటర్వ్యూలో త్వరలోనే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తన పెళ్లిపై ఇన్ డైరెక్ట్ గా ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె అలా చెప్పడంతో అర్జున్ కపూర్ తో పెళ్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఇదే విషయంపై స్పందించిన అర్జున్ తన జీవితంలో తన ప్రేమ గురించి తన కంటే ఎక్కువగా వేరే వాళ్లకు తెలుస్తుంది అని నవ్వుతూ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

దీన్ని బట్టి అతను మలైకా అరోరా తో పెళ్లి చేసుకోవడానికి ఇంకా సిద్ధం కాలేదు అని తెలుస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఈ జంట మీడియాను ఆకర్షిస్తు ఉంటుంది. ఇక ఈ ఏడాది నవంబర్లో పెళ్లి జరగబోతుంది కూడా టాక్ వచ్చింది. కానీ అర్జున్ కపూర్ ఇలా వివరణ ఇవ్వడంతో ఇప్పుడు అవన్నీ కూడా అబద్ధమే అని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus