ఫ్రెండ్‌ హతమయ్యాక.. జాగ్రత్త పడుతున్న స్టార్‌ హీరో.. అంత రేటు పెట్టి కారు..!

సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) వర్సెస్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మధ్య గత కొన్నేళ్లుగా వైరం కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ ఎప్పుడూ ఎదురుపడలేదు కానీ.. సల్మాన్‌ మీద ప్రతీకారం తీర్చుకుంటా అంటూ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తరచుగా వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో ఝలక్‌లు కూడా ఇస్తున్నారు. ఇటీవల సల్మాన్‌ స్నేహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీని హత్య చేశారు. దీంతో సల్మాన్‌ మరింత జాగ్రత్తపడ్డాడు అని చెబుతున్నారు.

Salman Khan

బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీలో సల్మాన్‌ ఖాన్‌ చుట్టూ చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్‌ షూటింగ్‌ సమయంలో భద్రతా ఏర్పాట్లు చాలా టైట్‌ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. సెట్స్‌లోకి ఇతరులు, ప్రేక్షకులు అడుగుపెట్టాలంటే చాలా రూల్స్‌ పాటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ కార్ రెడీ అవుతోంది అని తెలుస్తోంది.

నిస్సాన్ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎస్‌యువీ కారును సల్మాన్ ఖాన్ కోసం ఆర్డర్ చేశారని సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ కారుగా దీనిని తీర్చిదిద్ది దుబాయి నుండి స్వదేశానికి తీసుకొస్తారని చెబుతున్నారు. మొత్తంగా ఈ కారు కోసం సుమారు రూ. రెండు కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇల్లు, సినిమా సెట్స్‌, బిగ్‌బాస్‌ సెట్స్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బులెట్‌ ప్రూఫ్‌ కారు అవసరమని ఫిక్స్‌ అయ్యారట.

అన్నట్లు సల్మాన్‌ ఖాన్‌కు వస్తున్న బెదిరింపులు ఇటీవల శ్రుతి మించాయి. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో జీవించాలని అనుకుంటే తమకు రూ. ఐదు కోట్లు ఇవ్వాలని.. లేదంటే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా సల్మాన్‌ ఖాన్‌ను హతమారుస్తామని లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపు మెసేజ్‌ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అర్థమవుతోంది. ఆ కారు త్వరలో దేశానికి వచ్చాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మూడున్నర గంటల నిడివి.. రజినీ సినిమాకి కమల్ సాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus