ఈ స్టార్ హీరో ఇల్లు అమ్మేయడానికి అసలు కారణమిదా?

సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన ఫ్లాట్లను, విల్లాలను కొనుగోలు చేయడం ద్వారానే వార్తల్లో ఎక్కువగా నిలవడం జరుగుతుంది. ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు భారీ మొత్తం ఖర్చు చేసి ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఫ్లాట్ ను తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అమ్మేయడం గమనార్హం. తాజాగా అర్జున్ కపూర్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ను అమ్మేశారు. గతేడాది 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఫ్లాట్ ను అర్జున్ కపూర్ కేవలం 16 కోట్ల రూపాయలకు అమ్మేయడం గమనార్హం.

అర్జున్ కపూర్ తన ప్రేయసి మలైకా అరోరా ఇంటికి సమీపంలో ఉండాలనే ఆలోచనతో ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏడాది వ్యవధిలోనే అర్జున్ కపూర్ ఫ్లాట్ ను అమ్మేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుండగా తక్కువ మొత్తానికి ఫ్లాట్ ను అమ్మేయడం చర్చనీయాంశమైంది. అర్జున్ కపూర్ మలైకా అరోరా మధ్య ప్రేమ వ్యవహారం చెడిందని అందుకే అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్మేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నాలుగు కోట్ల రూపాయల నష్టానికి ఇంటిని అమ్మేయడానికి గల కారణాన్ని అర్జున్ కపూర్ వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు అర్జున్ కపూర్ ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తవుతున్నాయి. అర్జున్ కపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రతి సంవత్సరం తను నటించిన ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా అర్జున్ కపూర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

అర్జున్ కపూర్ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు ఉన్నాయి. అర్జున్ కపూర్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధిస్తే ఈ హీరో రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా అర్జున్ కపూర్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus