స్టార్ హీరో వారసుడితో జక్కన్న.. సర్ ప్రైజ్!

Ad not loaded.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’ భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇది హిందీ చిత్రసీమ నేపథ్యంతో సాగే ఆసక్తికరమైన సిరీస్‌గా ఉండబోతోందని టాక్. ఈ ప్రాజెక్టులో బాబీ డియోల్ (Bobby Deol), లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రణవీర్ సింగ్ (Ranveer Singh) అలియా భట్ (Alia Bhatt), సల్మాన్ ఖాన్ (Salman Khan), అమీర్ ఖాన్ (Aamir Khan) వంటి టాప్ స్టార్‌లు స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నారని సమాచారం.

Shah Rukh Khan

అయితే ఇందులో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) కూడా కనిపించనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించిన పఠాన్, జవాన్ (Jawan) వంటి సినిమాల తర్వాత షారుఖ్ తన కుమారుడికి భారీ స్థాయి వెబ్ సిరీస్‌ను లాంచ్ చేయడం విశేషంగా మారింది. ఈ సిరీస్ జూన్ 2025 మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఐపీఎల్ తర్వాతి బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజ్ ఇదే కావడం విశేషం.

షారుఖ్ బృందం ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్య విస్తృతంగా ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ట్రైలర్‌ను వేసవి ప్రారంభంలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులంతా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఫోటోలు, కొంత ప్రమోషనల్ కంటెంట్ లీక్ కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్యన్ ఖాన్ తొలి ప్రాజెక్ట్‌కి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడట. రాజమౌళి, కరణ్ జోహార్ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది మామూలు విషయం కాదు. మొత్తానికి బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ బాలీవుడ్‌లో 2025లో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్‌గా నిలిచేలా ఉంది. బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా దీనికి భారీ స్పందన లభించే అవకాశాలున్నాయి.

RC16 ఆయువు పట్టు:.. గట్టిగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus