Jr NTR: స్టార్ హీరో ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించే హీరో అతనేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా, క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తారక్ వార్2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో తారక్ కు తమ్ముడి పాత్ర కూడా ఉందని తారక్ తమ్ముడి పాత్రలో కన్నడ హీరో ధృవ్ సర్జా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ పాత్ర నిడివి తక్కువని ఈ పాత్రకు సంబంధించి ట్రాజెడీ ఎండింగ్ ఉండనుందని భోగట్టా.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మార్వెల్ కు పని చేసిన స్టంట్ మాస్టర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం. వార్2 సినిమాలో సౌత్ యాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

వార్2 సినిమాకు సౌత్ ఇండియాలో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. వార్2 సినిమాలో కథనం కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. వార్2 సినిమా స్టైలిష్ ఫైట్ సీన్లు ఎక్కువగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. వార్2 సినిమా సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ మార్కెట్ అంచనాలను మించి పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

వార్2 సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. దేవర (Devara) ప్రమోషన్స్ లో భాగంగా తారక్ వార్2 మూవీ అప్ డేట్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. వార్2 సినిమాకు తారక్ పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus