Rana Daggubati: రానాకి క్లాస్‌ పీకింది ఎవరు? ఎందుకు పీకారు?

‘‘నేను సినిమాల్లోకి వచ్చి 12 ఏళ్లు అవుతుంది. నటుడిని అయ్యాను తప్ప, ఇంకా హీరో కాలేదు’’ అంటూ ఆ మధ్య ‘భీమ్లా నాయక్‌’ ఈవెంట్‌లో చెప్పాడు రానా. గుర్తుంది కదా.. ఆ రోజు అలా ఎందుకున్నాడో తెలియదు కానీ, తాజాగా మరోసారి తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌ గురించి ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు రానా. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో పదేళ్ల క్రితమట.

సూర్య నటించిన ‘ఈటి’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి రానా ఓ అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కెరీర్‌ను సూర్య ఎలా ప్రభావితం చేశాడు అనేది చెప్పుకొచ్చాడు. సూర్యను ‘పితామగన్‌’ సినిమా చూసినప్పటి నుండి ఇష్టపడుతున్నానని, అయితే చాలా రోజుల తర్వాత అతన్ని కలిశానని, స్నేహం కుదరిందని చెప్పుకొచ్చాడు రానా. దాంతోపాటు పదేళ్ల క్రితం ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు రానా. రానా నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఓ రెండేళ్ల తర్వాత…

ఓ సినిమా ఎడిటింగ్‌ రూమ్‌లో ఉన్నప్పుడు సూర్య చూశారట. ఆ తర్వాత రానాను కారు ఎక్కించుకుని, హైదరాబాద్‌లో నాలుగు గంటలపాటు తిప్పుతూ… క్లాస్‌ పీకాడట. నువ్వు చేస్తున్నది యాక్టింగ్‌ కాదు, ఏదో సర్దేస్తున్నావు అని హితోపదేశం చేశాడట. అలా ఆయన పీకిన క్లాస్‌ నన్ను భల్లాలదేవ, డేనియల్‌ శేఖర్‌ని చేసింది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు రానా. ఈ సందర్భంగా రానాను సూర్య మాట్లాడకుండా ఆపబోయాడు. వద్దు వద్దు అంటూ వారించాడు కూడా.

దీనికి రానా నువ్వు చెప్పింది, నాకు సాయం చేసింది అందరికీ తెలియాలి కదా అంటూ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. అలా తన కెరీర్‌లో సూర్య మాటల ప్రభావం చాలానే ఉంది అని చెప్పుకొచ్చాడు రానా. ఆ తర్వాత సూర్య మాట్లాడుతూ రానా నన్ను కొంచెం బ్యాడ్‌ చేశాడు. అయినా నా మాటల వల్ల రానా ఇంతవాడు అయ్యాడంటే ఆనందమే కదా అని చెప్పాడు. ఇద్దరు హీరోలు ఇలా మాట్లాడుకోవడం హ్యాపీనే కదా.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus