Ormax Survey: ఆర్మాక్స్ సర్వే జూన్ నెల ఫలితాలివే.. మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?

ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా వెల్లడించే సర్వేల ఫలితాలు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ తెలుగు జూన్ నెల 2024కు సంబంధించి ఆర్మాక్స్ సర్వే ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ప్రభాస్ (Prabhas) నంబర్ వన్ స్థానంలో నిలిచారు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆర్మాక్స్ సర్వేలో మరోమారు నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ప్రభాస్ కు అన్ని విధాలుగా కలిసొస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా హిట్లను సొంతం చేసుకుంటున్న ప్రభాస్ ఈ జాబితాలో కూడా టాప్ లో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ తర్వాత ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు (Jr NTR)  స్థానం దక్కింది.


త్వరలో దేవర (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ ఆర్మాక్స్ సర్వేలో సైతం అదరగొట్టారనే చెప్పాలి. దేవర సినిమాతో తారక్ సోలో హీరోగా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రాకముందే ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం కొసమెరుపు. త్వరలో పుష్ప2 (Pushpa 2)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బన్నీ (Allu Arjun)  ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

రామ్ చరణ్ (Ram Charan)  ఐదో స్థానంలో నిలవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని (Nani) , మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ లిస్ట్ లో తర్వాత స్థానాలలో నిలిచారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవికి మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కు చోటు దక్కకపోవడంతో ఆయా హీరోల అభిమానులు ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus