స్టార్‌ యాక్టర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన భార్య.. ఏమైందేంటే?

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ – అతని భార్య మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం మరో మలుపు తిరిగింది. తనను నవాజుద్దీన్‌ ఇంటి నుండి గెంటేశాడు అంటూ.. భార్య ఆలియా సోషల్‌ మీడియాలో శుక్రవారం రాత్రి రెండు వీడియోలు పోస్ట్‌ చేశారు. దాంతోపాటు ఏం జరిగింది అనే వివరాలు తెలుపుతూ పోస్ట్‌లో చేశారు. ‘‘నా భర్త నన్ను, నా పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు’’ అంటూ ఆ వీడియోల ఆలియా అలియాస్‌ జైనబ్‌ ఆరోపించారు. ఈ మేరకు వీడియోలో ఇంటి దగ్గర పరిస్థితుల్ని చూపించారు.

తమ ఇంటి దగ్గర గుమ్మంలో కాపలాదారులను పెట్టి మరీ తమను లోనికి అనుమతించలేదంటూ ఆమె వీడియోల్లో వివరించారు. ఈ దంపతుల కుమారుడు (7), కుమార్తె (12) కూడా ఆ వీడియోల్లో కనిపిస్తున్నారు. అధికారులు పిలిచారని తాను వెర్సోవా పోలీస్‌ స్టేషనుకు వెళ్లొచ్చే లోపు తన ఇంటికి తనను రానివ్వడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఆలియా ఆరోపణలను నవాజుద్దీన్‌ ప్రతినిధి ఖండించారు. ఆ ఇల్లు నవాజుద్దీన్‌ తల్లి పేరిట ఉండటంతో.. ఈ ఘటనలో సిద్ధిఖీ ప్రమేయం లేదని వెల్లడించారు.

సిద్దీఖి దంపతుల వివాదం గత నెల బాంబే హైకోర్టులో విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు మైనర్‌ పిల్లల దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఈ విషయం బయట తేల్చుకుంటారేమో అనుకున్నారంతా. కానీ ఆమె ఇప్పుడు ఇలా వీడియోలు రిలీజ్‌ చేయడంతో విషయం తేలలేదు అని అర్థమైంది. మరోవైపు నవాజుద్దీన్‌ తన పిల్లల ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారని సమాచారం.

ప్రస్తుతం ఆలియా తన బిడ్డలతో కుటుంబ సభ్యుల ఇంట్లో తల దాచుకుంటున్నారు. ఈ మేరకు మరో వీడియోను కూడా షేర్‌ చేశారు. ఓ ఇంట్లో నేలపై పిల్లలు నిద్రపోతున్నారు. ఇదంతా చూస్తుంటే మీకు నవాజుద్దీన్‌ చిన్న బుద్ధి మీకు అర్థమవుతోంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఎవరెన్ని చేసినా తనను తన బిడ్డల నుండి దూరం చేయాలేరు అంటూ ఆలియా చెప్పుకొచ్చారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus