తన మనస్సులో ఉన్న ఊహలను అద్భుతంగా తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ రాజమౌళి విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలేవీ ఫ్లాప్ కాలేదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బుల్లితెరపై కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. రాజమౌళి సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
సాధారణంగా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడానికి ఆసక్తి చూపరు. అయితే రాజమౌళి దర్శకత్వంలో సినిమా కాబట్టి ఆర్ఆర్ఆర్ లో నటించడానికి తారక్, చరణ్ ఓకే చెప్పారు. ఆర్ఆర్ఆర్ కనీవిని ఎరుగని రికార్డులను సొంతం చేసుకుంటే మాత్రం ఒకే రేంజ్ ఉన్న స్టార్ హీరోలు కలిసి మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఆర్ఆర్ఆర్ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మల్టీస్టారర్ సినిమాలకు సాధారణ సినిమాలలా ఎక్కువరోజులు డేట్లు కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఆర్ఆర్ఆర్ ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని టాలెంట్, సక్సెస్ ఉన్న దర్శకులు మల్టీస్టారర్ కథలతో స్టార్స్ ను కలిస్తే స్టార్స్ సైతం నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. ఆర్ఆర్ఆర్ హిట్టైతే జరిగేది ఇదేనని ప్రేక్షకులు, నెటిజన్లు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోల మల్టీస్టారర్లు, కోలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోల మల్టీస్టారర్లు కూడా తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. తమ భవిష్యత్తు ప్రాజెక్టులు పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కే విధంగా ఈ స్టార్ హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా చరణ్ తర్వాత ప్రాజెక్ట్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!