Star Heroes: సినిమాకు కథే హీరో ..అలాంటి సినిమాలపై ఓ లుక్ వెయ్యండి!

ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకోసం డైరెక్టర్లు కూడా చాలా కష్టపడి ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే.. కొన్ని సినిమాలలో మాత్రం హీరో ఎంట్రీ సీన్ ను చాలా లేట్ చేసారు. అయినా, ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలా హీరో ఎంట్రీ లేట్ అయినా, సూపర్ హిట్ అయిన 3 సినిమాల లిస్ట్ పై ఓ లుక్ వెయ్యండి.

1. క్షణ క్షణం

వెంకటేష్ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా నటించిన క్షణ క్షణం సినిమా వెంకటేష్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.

2. కెప్టెన్ ప్రభాకర్

రోజా భర్త సెల్వమణి కెరీర్ లో మంచి హిట్ సినిమా కెప్టెన్ ప్రభాకర్. ఈ సినిమాలో కూడా హీరో విజయకాంత్ ఎంట్రీ దాదాపు అరగంట తరువాతే ఉంటుంది. కాగా, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

3. మగాడు

రాజా శేఖర్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరో ఇంటర్వెల్ సీన్ కు ఒక సీన్ ముందుగా వస్తాడు. అప్పటివరకు హీరో ఇంట్రడక్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ రాజశేఖర్ వచ్చే వరకు స్లో గా నడిచి, రాజశేఖర్ ఎంట్రీ తో స్పీడ్ అప్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మేడ పై నుంచి దూకే క్రమంలో రాజశేఖర్ కు గాయాలు అయ్యాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus