‘7 / జి బృందావన కాలనీ’.. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 18 ఏళ్ళ క్రితం అంటే 2004 అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరో రెగ్యులర్ సినిమాల్లో కనిపించే విధంగా కనిపించడు..! ఓ మూర్ఖుడిగా కనిపిస్తాడు. హీరోయిన్ ను.. మొదటి నుండి కామంతోనే చూస్తాడు.
కానీ ఆమెతో పడక సుఖం అనుభవించినా.. ‘మోజు తీరిపోయింది కదా’ అని వదిలేయడు. ఆమె చనిపోయాక కూడా ప్రేమించడం మానడు. ఇలాంటి కథతో అప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ తర్వాత కూడా ఇంకో సినిమా రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఏ.ఎం.రత్నం గారి అబ్బాయి రవికృష్ణ .. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రవికృష్ణ కాదట. అవును.. ముందుగా ఈ కథని మాధవన్, సూర్య వంటి స్టార్ హీరోలతో చేయాలనుకున్నారట. కానీ వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సిద్దార్థ్ ను కూడా అప్రోచ్ అయ్యారట. అతను కూడా ‘బాయ్స్’ తో బిజీగా ఉండటంతో దర్శకుడు సెల్వ రాఘవన్ .. ‘రవికృష్ణతోనే చేసేద్దాం’ అని లుక్ టెస్ట్ చేశాడట. అలా ఇది రవికృష్ణ చేయడం.. ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!