వీడు ఇండస్ట్రీని ఏలేస్తాడు – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) గురించి ఒక టైమ్ లో రాజమౌళి (Rajamouli) చెప్పిన మాట ఇది. అ! నుంచి మొదలైన అతని బిగ్ స్క్రీన్ జర్నీ చాలామంది అగ్ర దర్శకులను హీరోలను ఎట్రాక్ట్ చేసింది. బాలయ్య (Nandamuri Balakrishna) అయితే ఏకంగా వారసుడిని అతని చేతిలో పెట్టేశాడు. ఇక హనుమాన్ సినిమాతో గ్రాండ్ గా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఇటీవల కొన్ని రిజెక్షన్స్ ఎదుర్కొన్న తీరు మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
ఏ దర్శకుడైనా కొన్ని కథల విషయంలో రిజెక్షన్స్ ఎదుర్కోవడం సాధారణంగా జరిగేది. కానీ హనుమాన్ (Hanuman) తో 100 కోట్లకు పైగా ప్రాఫిట్ చూపించినా దాని సీక్వెల్ కథతో రిజెక్ట్ కావడమనేది ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ప్రశాంత్ ప్లాన్ ప్రకారం అయితే జై హనుమాన్ సినిమా 2025 సంక్రాంతికి రావాల్సిన సినిమా. కానీ ఆ సమయం దగ్గర పడుతున్నా ఇంకా హీరో ఫైనల్ కాలేదు.
అయితే ఖాళీగా లేకుండా వర్మ ఏదో ఒక స్క్రిప్ట్ తో మాత్రం బిజీ అయ్యాడు. మోక్షజ్ఞ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా భవిష్యత్తు మల్టివర్స్ కథలకు హీరోలను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు. ఇక జై హనుమాన్ టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చుట్టూ తిరిగింది. అలాగే తమిళ్ లో కూడా ఒక స్టార్ ను సంప్రదించినా ఒప్పుకోలేదట. కన్నడ స్టార్ యశ్ ను (Yash) కూడా కలువగా అతను ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక రిషబ్ శెట్టి (Rishab Shetty) అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఏదేమైనా జై హనుమాన్ తో (Jai Hanuman) అంత పెద్ద హిట్ కొట్టిన ప్రశాంత్ కు ఊహించని రిజెక్షన్స్ ఎదురయ్యాయి. ఆ మధ్య రణ్ వీర్ సింగ్ తో (Ranveer Singh) కూడా ఒక సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపించింది. కానీ టెస్ట్ షూట్ అనంతరం ఆ హీరో కూడా డ్రాప్ అయ్యాడు. కారణం ఏదైనా ప్రశాంత్ వర్మ మరొక బిగ్ హిట్ కొట్టి తన సత్తా చూపించాల్సిందే.