2025 సంక్రాంతి.. ఇది ఊహించని పోటీ అవుతుందేమో..!

సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే.. కచ్చితంగా వాటికి బాగా డబ్బులు వస్తాయి. హిట్టు, ప్లాప్.. అనే తేడా లేదు. టాక్ ఓ మాదిరిగా వచ్చినా మంచి కలెక్షన్లు వస్తాయి. అందుకే ఈ సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం కొంతమంది చిత్రీకరణ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తూ ఉంటారు.

ఎందుకంటే ఎక్కడ వేరే సినిమా యూనిట్ కూడా సంక్రాంతికి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తే థియేటర్స్ అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుందేమో అని..! ప్రతి సంక్రాంతికి ఇదొక ఇబ్బంది మనం చూస్తూనే ఉన్నాం. వాటి కోసం వివాదాలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. 2024 సంక్రాంతి ముగిసిన వెంటనే 2025 లో సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే అంటూ ప్రకటనలు కూడా రావడం అందరికీ తెలిసిన సంగతే.

ఏదీ ఫిక్స్ అవ్వకుండానే మార్పులు కూడా చోటుచేసుకున్నాయంటూ న్యూస్ లు వస్తుండటం ఇంకో వింత. ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. అలాగే ‘శతమానం భవతి’ సీక్వెల్ ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ కూడా వస్తుందనే ప్రకటన వచ్చింది. అయితే ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ బదులు దిల్ రాజు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న (Star Heroes) ‘వెంకటేష్ 76’ ని 2025 సంక్రాంతికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.

అలాగే బాలయ్య – బాబీ..ల సినిమా, నాగార్జున నెక్స్ట్ మూవీ కూడా 2025 సంక్రాంతికే రాబోతున్నట్టు సమాచారం. అలా జరిగితే కనుక.. 2025 సంక్రాంతి మొత్తం సీనియర్ హీరోలదే అవుతుంది. చూడాలి మరి.. అదే జరుగుతుందా? లేక మార్పులు చోటు చేసుకుంటాయా? అనేది

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus