Thaman: తమన్‌ మ్యూజిక్‌ కోసం అంతలా వెయిట్‌ చేయిస్తున్నాడా?

ఓ సినిమాకు తమన్‌తో మ్యూజిక్‌ చేయించుకుంటే సినిమా కచ్చితంగా హిట్‌ అంటుంటారు.. ఇది టాలీవుడ్‌ నమ్మకం. ఇటీవల కాలంలో విజయం సాధించిన సినిమాల్లో తమన్‌ సంగీతం అంత హైలైట్‌ అయ్యింది మరి. అయితే తమన్‌ మ్యూజిక్‌కి వచ్చిన ఫేమ్‌ పక్కనపెడితే… మ్యూజిక్‌ తీసుకోవడానికి పడాల్సిన తంటాలే ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తోంది. తమన్‌తో ఓ సినిమాకు పాటలు చేయించుకోవాలలంటే దర్శకులు రోజుల తరబడి వెయిట్‌ చేయాల్సి వస్తోందని టాక్‌. దీనికి సంబంధించి కొంత సమాచారం ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’లోనే వచ్చింది.

ఈ కార్యక్రమం సెమీఫైనల్‌ ‘అన్‌స్టాపబుల్‌ 6 విత్‌ బాలకృష్ణ’ ఎపిసోడ్‌లో.. పాటలు ఇవ్వడానికి తమన్‌ ఎంత ఇబ్బంది పెడుతున్నాడో చెప్పకనే చెప్పాడు బాలయ్య. ‘మా సినిమాకు పాటలు ఇవ్వమంటే ఇవ్వకుండా… ఇక్కడ మార్కులు వేసుకుంటున్నావా?’ అంటూ సరదాగా నవ్వేశాడు బాలయ్య. దానికి తమన్‌ ముఖాన్నికవర్‌ చేసేసుకున్నారు తమన్‌. బాలయ్యలో భోళాతనం ఎక్కువ కాబట్టి.. అలా నేరుగా మాట్లాడేశాడు అనుకోవచ్చు. కానీ ఆ కార్యక్రమం ఫైనల్‌కి చిరంజీవి వస్తున్నారు. అందులోనూ తమన్‌కి కౌంటర్లు పడినట్లున్నాయ్‌.

షో ఫైనల్‌కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో కార్యక్రమం కోసం, చిరంజీవి రాక కోసం ఎదురుచూస్తున్నట్టుగా తమన్‌ను చూపించారు. ఈ క్రమంలో ‘గాడ్‌ఫాదర్‌’ పాటల కోసం అడిగితే ఏం చెప్పాలి అనే ప్రశ్న తమన్‌ తనను తాను అడుగుతున్నట్లుగా చూపించారు. అదేంటి.. తన మీద తానే కామెంట్‌ వేసుకున్నాడా అనే డౌట్‌ రావొచ్చు. తమన్‌ ఇలాంటివి గతంలోనూ చేశాడు. ఈ రెండు విషయాలను, గతంలో కొంతమంది దర్శకులు చెప్పిన మాటల్ని కలిపితే ఇప్పటికీ తమన్‌ టైమ్‌కి పాటలు ఇవ్వడం లేదనేది తెలిసిపోతుంది.

తమన్‌ సంగీతం సూపర్‌ ఉండొచ్చు కానీ, తమన్‌ టైమ్‌సెన్స్‌ మాత్రం కాదు అంటుంటారు. సరైన సమయానికి పాటలు ఇవ్వకపోవడంతో దర్శకులు హైదరాబాద్‌ టు చెన్నై చక్కర్లు కొడుతుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తన మీద తాను జోకు వేసుకోవడం కాకుండా… ఇలాంటి సమస్యను అధిగమిస్తే తమన్‌కి మంచిదేమో.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus