Kalki 2898 AD: కల్కిలో దీపిక రోల్ కు ఆ హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందా.. ఏం జరిగిందంటే?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా సక్సెస్ సాధించడానికి కారణమైన కీలకమైన పాత్రలలో దీపికా పదుకొనే  (Deepika Padukone) పాత్ర ఒకటి. సుమతి అలియాస్ sum 80 పాత్రలో ఆమె కనిపించి తన నటనతో మెప్పించారు. అయితే ట్రైలర్ విడుదలైన సమయంలో దీపికా పదుకొనే పాత్ర డబ్బింగ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. మొదట ఈ సినిమాలో దీపిక పాత్రకు దీపికా పదుకొనే డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే ఆమె వాయిస్ విషయంలో ఎక్కువ మంది నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమైన నేపథ్యంలో ఆ పాత్రకు మరో హీరోయిన్ తో డబ్బింగ్ చెప్పించారని సమాచారం అందుతోంది.

ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. కల్కి సినిమాలో శోభిత కూడా ఉందంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుండగా శోభిత సినిమాలో నటించలేదని డబ్బింగ్ చెప్పిందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి కల్కి టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో శోభిత కల్కి సినిమాలో నటిస్తున్నారని ఒక వార్త వైరల్ కాగా ఆ వార్త నిజం కాదని సినిమా రిలీజ్ తో తేలిపోయింది.

కల్కి సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఆ వార్త క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమా చూసిన వాళ్లకు మళ్లీ మళ్లీ చూడాలనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే 2డీలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు 3డీలో సైతం ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సక్సెస్ తో రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన కథలతో టాలీవుడ్ ఖ్యాతి మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2026 సంవత్సరంలో కల్కి సీక్వెల్ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్కి సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus