Rajinikanth: ఆ హీరోలు రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులోకి రానా..!

లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు రానా దగ్గుబాటి. అందరిలా కాకుండా పొలిటికల్ బ్యాగ్రౌండ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. ఆ తర్వాత రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో విలన్ గా కనిపించారు. అప్పటివరకు హీరోగా అలరించిన ఆయన.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రానా కెరీర్ స్లో అయ్యింది.

దీంతో ఇప్పుడు ఆయన నిర్మాతగానూ మెప్పిస్తున్నారు. చివరిసారిగా సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమాలో నటించిన రానా.. ఇటీవలే హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రానా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా కోలీవుడ్ సూపర్ స్టార్ మూవీకి అని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నారు (Rajinikanth) తలైవా.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా వసూళ్ల రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓవైపు థియేటర్లలో భారీగా కలెక్షన్స్ రాబడుతూ జైలర్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా.. రజినీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. జైభీమ్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీ సినిమా చేయనున్నారు. తలైవా కెరీర్ లో 170వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

ఇందులో రానా కీలకపాత్రలో నటించనున్నారని టాక్. ముందుగా ఈ పాత్ర కోసం న్యాచురల్ స్టార్ నాని, శర్వానంద్ ను సంప్రదించగా.. వాళ్లు ఒప్పుకోలేదని.. రానా మాత్రం అంగీకరించాడని సమాచారం. ఈ చిత్రంలో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించనున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అలరించిన రానా.. ఈ సినిమాతో తమిళ్ ప్రేక్షకులకు దగ్గరకానున్నాడు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus