షకీరా పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతుందని అమెరిన్ల అభిప్రాయం! తన పాటతోనే కాదు, నాజూకు షోకులతోనూ కుర్రాళ్ళను కిర్రెక్కించిన గాయని షకీరా. ఇంతకూ షకీరాను గురించి ఇప్పుడు అదే పనిగా ముచ్చటించుకోవడానికి కారణమేంటి? 46 ఏళ్ళ షకీరా ఇప్పటికి ఇద్దరితో సహజీవనం సాగించింది. 2000-2010 మధ్యకాలంలో అర్జెంటీనా లాయర్ ఆంటోనియో డి లా రుయాతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అమ్మడు. ఇక 2011 నుండి గత సంవత్సరం దాకా స్పానిష్ ఫుట్ బాలర్ గెరార్డ్ పిక్ తో కలసి సాగింది.
ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం, షకీరా పన్ను ఎగవేతపై నమోదైన కేసు విచారణలో భాగంగా స్పెయిన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దానివల్ల తన జైలు శిక్ష తగ్గించుకున్నట్లు తెలిసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్ ప్రభుత్వానికి రూ.131 కోట్లు పన్ను చెల్లించలేదని షకీరాపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత షకీరాకు 8 ఏళ్ల 2 నెలలు జైలు శిక్షతోపాటు రూ.216 కోట్లు జరిమానా విధించారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.
అయితే షకీరా స్పానిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలం అయినట్లు ఆమె ఒప్పుకున్నారు. మూడేళ్లు జైలు శిక్ష, రూ.6.3 కోట్లు జరిమానా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. షకీరా కఠిన నిర్ణయం తీసుకున్నారని, తన కెరియర్, పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నారని ఆమె తరఫు వాదించిన న్యాయవాద సంస్థ మిరియం కంపెనీ తెలిపింది. ఆమె తరఫు వాదించేలా అన్ని అంశాలను సిద్ధం చేశామని, కానీ తను అమాయకత్వం వల్ల అధికారులతో ఈ ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
అయితే 2014 వరకు (Shakira) షకీరా సంచార జీవితాన్ని గడుపుతున్నారని షకీరా న్యాయవాదులు వాదించారు. ఆమె అంతర్జాతీయ పర్యటనల నుంచి చాలా డబ్బు సంపాదించారని, జనవరి 2015లో తన రెండవోకుమారుడు పుట్టకముందే ఆమె బార్సిలోనాకు శాశ్వతంగా మారిందని వాదించారు. ఫుట్‌బాల్ స్టార్లు లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రముఖులపై పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించనందుకు స్పెయిన్ వారి పై కఠిన చర్యలకు ఉపక్రమించింది.