నవంబర్ అనేది సినిమాలకి అన్ సీజన్ అని తెలిసినా ఆప్షన్ లేక తమ సినిమాని రిలీజ్ చేసినట్టు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ యూనిట్ తెలిపింది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. టికెట్లు తెగలేదు. ‘సినిమా’ నేపథ్యంలో సినిమా తీస్తే హిట్ దక్కదు అనే సెంటిమెంట్ కూడా ఈ సినిమా విషయంలో మరోసారి నిజమైంది. కానీ ‘మా సినిమా ఫలితాన్ని అప్పుడే డిసైడ్ చేసేయొద్దు.. మా సినిమాకి కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది’ అంటూ హోప్స్ పెట్టుకున్నారు.
వాళ్ళని కరుణించే అనుకుంట ‘అఖండ 2’ ని వాయిదా పడేలా చేసి… ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. కానీ నిర్మాత మైత్రి రవి.. ఎటువంటి ప్రమోషన్స్ నిర్వహించడం లేదు. సాధారణంగా ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు హీరో, హీరోయిన్లు కనుక థియేటర్ విజిట్స్ కి వెళితే.. కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ విధంగా కూడా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీం ట్రై చేయడం లేదు. బహుశా టీం ఇక ‘ఆంధ్ర కింగ్..’ ను లైట్ తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సరిగ్గా 12 ఏళ్ళ క్రితం అంటే 2013 నవంబర్ 14న ‘మసాలా’ అనే సినిమా వచ్చింది. ‘గోల్ మాల్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్- రామ్..లు హీరోలుగా నటించారు.కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది.

కానీ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు కూడా రాలేదు. బాక్సాఫీస్ వద్ద ‘మసాలా’ సినిమా కేవలం రూ.11 కోట్ల షేర్ వద్దే ఔట్ అయ్యింది. ఆల్మోస్ట్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యేలా ఉంది.
