ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని జనసైనికులు మాత్రమే కాదు యావత్ తెలుగు రాష్ట్రం ఇంకా మరువక ముందే.. తమిళ రాష్ట్రంలో కమల్ హాసన్ పరాభవంతో అభిమానులు వేరు, ఓటర్లు వేరు అనే విషయం మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పార్టీకి కనీసం ఒక్క స్థానమైనా వచ్చింది. కొన్ని చోట్ల కాస్త గట్టి పోటీనే ఇచ్చారు. కానీ.. తమిళనాట కమల్ హాసన్ కి మాత్రం కనీస స్థాయి ఒట్లు కూడా పడలేదు.
దాంతో సినిమా నటులని జనాలు కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తున్నారని, వాళ్ళని లీడర్లుగా అంగీకరించడం లేదని తెలుస్తోందని విశ్లేషకులు విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ తో పోల్చి చూస్తే కమల్ హాసన్ ది మరీ దారుణమైన పరాజయం. ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పరిణామాలను పవన్, కమల్ హాసన్ లు ఎలా రిసీవ్ చేసుకొంటారు, వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారో చూడాలి.