సినిమా వాళ్ల పర్సనల్ మ్యాటర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరో వార్త ఇండస్ట్రీ మొత్తాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. దాని గురించి చర్చలు కూడా ఎక్కువయ్యాయి. ఓ టాప్ నిర్మాతకి సంబంధించిన వ్యవహారం ఇది. విషయంలోకి వెళితే.. ఓ టాప్ ప్రొడ్యూసర్ చాలా కాలంగా ఓ సీరియల్ నటితో నాలుగు గోడల మధ్య సంబంధం నడుపుతున్నాడు. ఆ సీరియల్ నటి (Actress) కూడా ఇలాంటి బంధానికి చాలా హ్యాపీగా ఒప్పేసుకుంది.
ఆ నటి (Actress) అంతకు ముందు తనతో కలిసి నటించిన సీరియల్ నటుడిని ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఎప్పుడైతే మనం ముందుగా చెప్పుకున్న టాప్ ప్రొడ్యూసర్ కన్ను.. ఆమెపై పడిందో, అప్పటి నుండి ప్రియుడితో ఆ సీరియల్ నటికి చెడింది. ఇది ఆ నిర్మాతకి ఇంకా అడ్వాంటేజ్ అయ్యింది. అతనికి మనసు బాగోలేకపోతే చాలు.. ఈ సీరియల్ నటే అతనికి స్ట్రెస్ బస్టర్. అతను వెకేషన్స్ కి వెళితే ఈమెను కూడా వెంటేసుకుని తీసుకెళ్తూ ఉంటాడు.
ఆ నిర్మాత వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తే, ఆ నటి (Actress) కూడా అదే లొకేషన్స్ నుండి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇద్దరూ సెపరేట్ సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మొన్నామధ్య ఈ నిర్మాత.. బాగా ఒత్తిడికి ఫీలయ్యి ఆమెను కొన్నాళ్ళు సేఫ్టీ లేకుండా కలిశాడట. కొద్దిరోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం అతనికి చెబితే కంగారు పడి అబార్షన్ చేయించుకోమని చెప్పాడట. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
అవసరమైతే పుట్టబోయే బిడ్డకు డి.ఎన్.ఎ టెస్ట్ చేయిస్తానని ఆమె తెగేసి చెప్పింది. దీంతో అతను కొంచెం తగ్గి.. ఆమెతో రాజీకి వచ్చాడు. ఆమె అబార్షన్ చేయించుకోవాలంటే తనకి ఒక ఫ్లాట్ కావాలని డిమాండ్ చేసిందట. దీంతో చేసేదేమీ లేక అతను రూ.3 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఆమె పేరున రాశాడట ఆ నిర్మాత. ఇది తెలుసుకున్న ఆ నిర్మాతకి సన్నిహితుడు అయినటువంటి ఓ దర్శకుడు ‘రోజుకు రూ.6 వేల కాల్షీటు కలిగిన నటికి (Actress).. రూ.3 కోట్లు ఫ్లాట్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నావు.. సిగ్గులేదా నీకు?’ అంటూ గడ్డిపెట్టాడట.