ఇటీవల ప్రముఖ కోలీవుడ్ నటుడు, నిర్మాత అయిన కే.రాజన్ ఓ తమిళ చిత్ర ఆడియో లాంచ్ వేడుకలో గాయని ప్రఖ్యాత గీతరచయితపై మీటూ ఆరోపణలు చేసిందంటూ చిన్మయి పేరు ఎత్తకుండా కామెంట్స్ చేసాడు. ‘ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును, గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసిందని ఆమె గురించి చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆపకుండా ఆమె ఇదే విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్తే… నేను ఆ గాయని పని పట్టడానికి కొందరిని సిద్ధం చేశానని బహిరంగంగా బెదిరించాడు.
అదే కార్యక్రమానికి హాజరైన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్ వెంటనే దానిని ఖండిస్తూ రాజన్‌పై ధ్వజమెత్తాడు. నటీమణులు, మహిళా ఆర్టిస్ట్‌ల పట్ల జరుగుతున్న అక్రమాలను ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ గుర్తించి నిందితులకు సరైన బుద్ధి చెప్పాలే కానీ ఇలా బెదిరింపులకు పాల్పడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు.‘మీటూ’ ఉద్యమం మొదలైనప్పుడు.. చిన్మయి తనకు పదేళ్ళ క్రితం ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. ప్రముఖ గేయ రచయిత వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆమె వెల్లడించింది. ఆ విషయం అందరూ పరిచిపోతున్న సమయంలో ఈ విషయం పై ఇటీవలే మరోసారి చిన్మయి స్పందిస్తూ .. వైరాముత్తు కనిపిస్తే చెంప చెళ్ళుమనిపిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.