‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. ఆ వెంటనే ‘పోకిరి’ తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు దక్కాయి. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్లో ఏ పొజిషన్ లో అయితే ఉందో.. అప్పట్లో ఇలియానా కూడా అదే స్థాయిలో స్టార్ డం ను అనుభవించేది. అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హిందీలో అవకాశాలు కోసం పరితపించి అక్కడ తన లక్ ను పరీక్షించుకోవాలని వెళ్ళింది. అటు తర్వాత ఈమె సౌత్ వైపు కన్నెత్తి చూడటం మానేసిందనే చెప్పాలి. దీంతో ఆమెకు సౌత్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్న సంగతి.
అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..’ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘దేవుడు చేసిన మనుషులు’ అనే సినిమా చేస్తున్న టైం లో ఇలియానా అలాగే నటరాజు అనే తమిళ నిర్మాతల మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇలియానా గతంలో.. విక్రమ్ హీరోగా తెరకెక్కాల్సిన ‘నందం’ అనే సినిమాలో నటించాల్సి ఉందట.అందుకోసం ఈమె రూ.40 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. దీంతో అడ్వాన్స్ గా తీసుకున్న రూ.40 లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా నిర్మాత ఇలియానాను కోరారట. కానీ అందుకు ఇలియానా ఒప్పుకోలేదు. దీంతో నటరాజు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. వాళ్ళు కూడా ఈ అతని ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయలేకపోయారు. కాబట్టి ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ వద్దకు ఈ వ్యవహారం వెళ్ళింది. అప్పటి నుండీ అఫీషియల్ గా ఇలియానా పై బ్యాన్ విధించకపోయినా అనధికారికంగా.. సౌత్ లో ఎవరూ ఆమెతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాం” అంటూ కాట్రగడ్డ ప్రసాద్ కామెంట్స్ చేశారు.