16 ఏళ్ల క్రితం జరిగిన ఓ చర్చను మళ్లీ ఇప్పుడు బయటకు తీసి లేనిపోని పంచాయితీలకు కారణమయ్యారు ఓ కోలీవుడ్ నిర్మాత. నాటి విషయం ఇప్పుడెందుకు అని కొందరు అంటుంటే.. అప్పుడైనా ఇప్పుడైనా మేం రిటార్ట్ గట్టిగానే ఇస్తాం అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. రజనీకాంత్ కెరీర్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై.. అంతకుమించి విజయం అందుకున్న చిత్రం ‘శివాజీ’. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2007లో వచ్చింది. ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చంతా.
2007లో విడుదలైన ‘శివాజీ’ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. అలాగే ఆ ఏడాదిలోనే అతి పెద్ద హిట్ సినిమాగా కోలీవుడ్‌లో నిలిచింది. ఈ సినిమాలో నటనకుగాను తమిళనాడు ప్రభుత్వం ‘ఉత్తమ నటుడు’ అవార్డును కూడా రజనీకాంత్‌కి అందించింది. అయితే ఆ అవార్డుకు రజినీకాంత్ అర్హుడేనా అని ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ అప్పుడు ప్రశ్న లేవనెత్తారు. రజనీకాంత్‌కు ఉత్తమ నటుడు అవార్డులు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా కెరీర్‌ను ప్రారంభించిన అమీర్ సుల్తాన్ ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు. ‘పరుత్తివీరన్’, ‘ఆది భగవాన్’ తదితర హిట్ సినిమాలను రూపొందించారు. రజనీకాంత్ టాలెంట్ గురించి ఏమీ మాట్లాడనని, అయితే 2007లో అతని కంటే బాగా నటించిన హీరోలు లేరా అని వ్యాఖ్యానించారు అమీర్ సుల్తాన్. 2007లో అమీర్ సుల్తాన్ ‘పరుత్తివీరన్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో కార్తీ నటనకు మంచి పేరొచ్చింది. అయితే తమిళనాడు ప్రభుత్వం అవార్డు రాలేదు. దీంతోనే ఇలా వ్యాఖ్యలు చేశారు అంటున్నారు.
ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న అమీర్ సుల్తాన్ ఉన్నట్టుండి రజనీకాంత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడెప్పుడో ఇచ్చేసిన అవార్డు గురించి ఇప్పుడు చర్చ పెట్టి ఏం సాధించాలి అనుకుంటున్నారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కార్తికి ఎందుకు ఇవ్వలేదు అని అప్పుడే అడిగి ఉండొచ్చు కదా అని కూడా అంటున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?