సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఇకలేరు..

గతకొద్ది రోజులుగా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. దీంతో, ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు సినిమా పరిశ్రమ వర్గాలవారు.. ఇక సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు..

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్త మర్చిపోకముందే.. దర్శకుడు మదన్ ఆకస్మిక మరణం చెందారు. అలాగే బెంగాళీ నటి ఇంద్రీలా శర్మ, పంజాబ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా వంటి వారు కన్నుమూశారు. విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్రమ్ గోఖలే, మలయాళ పరిశ్రమకు చెందిన రచయితలు బి.హరికుమార్, సతీష్ బాబు మరణించారు.

ఇప్పుడు కోలీవుడ్ నిర్మాత కె. మురళీ ధరన్ మరణించారనే వార్తతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ మూవీ మేకర్స్.. K. మురళీ ధరన్‌, వి. స్వామి నాథన్‌, జి. వేణు గోపాల్‌ ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్నారు. లక్ష్మీ మూవీ మేకర్స్ నిర్మాత కె. మురళీధరన్ ‘సీత ఇన్ గోకులం’, ‘ప్రియముధన్’, ‘థింకింగ్ ఆఫ్ యు’, ‘భగవతి’, ‘అన్బే శివం’, ‘పుతుప్పెట్టై’ మరియు ‘సిలంపట్టం’ వంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

అలాగే పంపిణీ దారుడిగానూ వ్యవహరించారు.. 2015లో ‘జయం’ రవి నటించిన ‘సకలకళా వల్లవన్’ ఆయన నిర్మించిన చివరి చిత్రం.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు మురళీ ధరన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus