సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.గత నెలలో కమెడియన్ అల్లు రమేష్, కొరియన్ పాప్ సింగర్ అలాగే నటుడు అయిన మూన్ బిన్, బాలీవుడ్ స్టార్ సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా,చెర్రీ (చిరంజీవి) తల్లి , అలాగే మలయాళం కమెడియన్ మాము కోయ, స్టార్ హీరో మమ్ముట్టి తల్లి, వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ అలాగే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు వంటి వారు మరణించారు.
అలాగే చాలా మంది సినీ సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా ఈ షాక్ ల నుండి ఇండస్ట్రీ కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో మరో నిర్మాత కూడా మరణించడం అందరికీ షాకిచ్చినట్టైంది. ప్రముఖ మలయాళ నిర్మాత పికెఆర్ పిళ్లై మంగళవారం నాడు త్రిసూర్‌లో మరణించారు. 1980-90ల టైంలో మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు పికెఆర్ పిళ్లై.
ఆయన (Star Producer) వయస్సు 90 సంవత్సరాలు. వయస్సు సంబంధిత సమస్యలతోనే ఆయన కన్నుమూసినట్టు సమాచారం. షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై ‘చిత్రం’, ‘వందనం’, ‘కిజక్కునరుమ్ పక్షి’ , ‘అమృతం గమ్య’ వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.ఆయన దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు. 12 సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళకు వచ్చేశారు పిళ్లై.
ఆయన భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. ఆయన ఎంతో మందికి డబ్బిచ్చి మోసపోయారు అంటూ ఆయన సతీమణి రమ్య చెప్పుకొచ్చింది. ఇక పికెఆర్ పిళ్లై అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించనున్నారు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!