రీసెంట్ గా ముంబైలో వంగానీ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనతో అక్కడ పనిచేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి రియల్ హీరో అయ్యాడు. ఓ మహిళ తన చిన్నారితో రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద నడుస్తుండగా.. ఆ బాలుడు కాలు జారీ రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. అప్పటికే వేగంగా రైలు వస్తోంది. ఇది చూసిన మయూర్ పరుగున వెళ్లి ఆ బాలుడిని ఫ్లాట్ ఫామ్ పైకి విసిరి ప్రాణాలు కాపాడాడు. అతడు చూపిన ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రైల్వేశాఖ మయూర్ షేక్ ని అభినందిస్తూ.. 50 వేల రూపాయల రివార్డుని ప్రకటించింది.
అతడిని రియల్ హీరోగా అభివర్ణించిన అధికారులు జావా మోటార్ బైక్ ను బహుమతిగా ఇచ్చారు. అయితే దీనిపై స్పందించిన ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ”రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు.. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పీవీపీపై మండిపడుతున్నారు.
నిన్నమొన్నటి వరకు నిర్మాతలుగా సినిమాలు చేసిన పీవీపీ.. ఆ హీరోలనే లంగా హీరోలని అనడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. లంగా డ్యాన్సులు వేసే రీల్ హీరోల చుట్టూ సినిమాల కోసం తిరిగిన లంగా గాడికి ఉన్నట్లుండి నీతులు గుర్తొస్తున్నాయా? మీకు సినిమాలు చేసిన హీరోలు ఈరోజు లంగా గాళ్ళు అయ్యారా..? ఒకరిని పొగడటం కోసం వృత్తిలో భాగమైన వారిని కించపరచడం వైసీపీ నాయకుల చీప్ మెంటాలిటీ అంటూ ఓ నెటిజన్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి కామెంట్స్ ఆయన పోస్ట్ పై చాలానే ఉన్నాయి.
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు 👍
లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి!
మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ 👍 pic.twitter.com/khkOY3O05F— PVP (@PrasadVPotluri) April 22, 2021
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!