Prabhas, Mahesh Babu: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన స్టార్ ప్రొడ్యూసర్!

చాలా సంవత్సరాల క్రితం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎం.ఎస్.రాజు ఒక వెలుగు వెలిగారు. సంక్రాంతి కానుకగా సినిమాలను విడుదల చేసి విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా ఎం.ఎస్.రాజు వార్తల్లో నిలిచారు. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాల విజయాలు ఎం.ఎస్.రాజుకు స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు రావడానికి కారణమయ్యాయి. అయితే తర్వాత కాలంలో నిర్మించిన పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఎం.ఎస్.రాజు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం పలు సినిమాలకు ఎం.ఎస్.రాజు దర్శకుడిగా పని చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అయితే తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన ఎం.ఎస్.రాజు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రవితేజ గుణశేఖర్ కాంబో మూవీకి నిర్మాతగా అవకాశం వస్తే నో చెప్పానని ఆయన తెలిపారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఖలేజా కథ నచ్చకపోవడంతో ఆ సినిమాను నిర్మించలేదని ఎం.ఎస్.రాజు కామెంట్లు చేశారు. గుణశేఖర్ రుద్రమదేవి సినిమాను నిర్మించాలని కోరగా ఆ సినిమాను నిర్మించడానికి తాను అంగీకరించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను అనుకున్న సినిమాలు మినహా వేరే సినిమాలు తీయనని ఆయన కామెంట్లు చేశారు.

ప్రభాస్, మహేష్ డేట్లు ఇచ్చినా వాళ్లతో సినిమాలను నిర్మించాలని తాను భావించడం లేదని ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు. ఎం.ఎస్.రాజు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పౌర్ణమి, ఆట, మరికొన్ని సినిమాలు భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో కెరీర్ విషయంలో ఎం.ఎస్.రాజు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 7 డేస్ 6 నైట్స్‌ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎం.ఎస్.రాజు అలీతో సరదాగా షోకు హాజరై ఈ విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఎం.ఎస్.రాజు బోల్డ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఎం.ఎస్.రాజు నిర్మించిన ఒక్కడు, వర్షం మహేష్, ప్రభాస్ కెరీర్ కు ప్లస్ అయ్యాయనే సంగతి తెలిసిందే. మహేష్, ప్రభాస్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus