Ajith: అజిత్ నా దగ్గర డబ్బులు ఎగ్గొట్టి చీట్ చేశాడు..నిర్మాత షాకింగ్ కామెంట్స్!

అజిత్ కుమార్ కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో అని చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా.. అజిత్ కోసం అతని సినిమా చూడాలనుకునే లాయల్ ఫ్యాన్స్ అతనికి ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అజిత్ ఎక్కడికి వెళ్లినా అతనో స్టార్ అన్నట్టు ప్రవర్తించడు. హంబుల్ నేచర్ కలిగిన వ్యక్తి అని అంతా అంటుంటారు. ‘తలా’ అంటూ అతని పేరుకు ముందు ట్యాగ్ లు పెట్టుకోవడం అతనికి నచ్చదు.

తిరుమల వెళ్లినా వీఐపీ దర్శనం కాకుండా సామాన్యుడిలా లైన్ లో నిలబడి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అలాంటి అజిత్ అందరూ అనుకునేంత గొప్పవాడు కాదు అంటున్నాడు ఓ నిర్మాత. వివరాల్లోకి వెళితే.. తమిళ నిర్మాత మణికమ్ నారాయణన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అజిత్ గురించి ఘోరమైన కామెంట్లు చేశాడు. అతను మాట్లాడుతూ.. ‘ అజిత్ అందరూ అనుకుంటున్నట్టు గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఓసారి మలేషియా వెకేషన్ కి వెళ్తున్న అతని తల్లిదండ్రుల కోసం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఫలితంగా సినిమా చేస్తానని చెప్పాడు. కానీ అలాంటిదేమి జరగలేదు.

ఇన్నేళ్లైనా అతను నా డబ్బు నాకు తిరిగిచ్చిందేమి లేదు. నాలాంటి నిర్మాతలు ఎంతో మంది (Ajith) అజిత్ వల్ల మోసపోయారు. తమతో సినిమా చేస్తాడని అజిత్ కి డబ్బులు ఇచ్చి ఏ ఎం రత్నం వంటి నిర్మాతలు చాలా డబ్బు పోగొట్టుకున్నారు ‘ అంటూ మణికమ్ నారాయణన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ నిర్మాత అజిత్ భార్య షాలినికి కూడా మంచి స్నేహితుడు. మరి ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు పారితోషికం అందుకునే అజిత్ కి ఇలాంటి నిర్మాతలని చేటు చేయాల్సిన అవసరం ఏముంటుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus