Jr NTR: ఆ సినిమా వల్ల నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను.. కానీ..!

టాలీవుడ్లో ఇప్పటికీ అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతుంది ‘వైజయంతి మూవీస్’ .అశ్వినీదత్ గారు తన కూతుర్ల సాయంతో ఈ బ్యానర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై చిన్న ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ వంటి చిన్న చిత్రాలను నిర్మిస్తూ భారీ లాభాలను కూడా అందుకున్నారు. తాజాగా వీరి బ్యానర్ నుండి వస్తున్న మూవీ ‘సీతా రామం’. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లో భాగంగా అశ్వినీ దత్ గారు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ అనూహ్యంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం.

మొన్నటికి మొన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో నాకు సంబంధం లేదు అని చెప్పిన దత్ గారు.. ఆ తర్వాత టికెట్ రేట్ల ఇష్యు గురించి, ఏపీ ప్రభుత్వం తీరు గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ తో చేసిన ‘శక్తి’ మూవీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో అశ్వినీదత్ గారు ‘శక్తి’ అనే చిత్రాన్ని నిర్మించారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు.

2011 నాటికి టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ ఇదే. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యి.. 50 శాతం వసూళ్ళను కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. ‘ ఈ సినిమా దెబ్బకి ఆల్మోస్ట్ హైదరాబాద్ వదిలి విజయవాడ వెళ్లి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.కానీ నేను ఆ టైంకి రియల్ ఎస్టేట్‌ బిజినెస్ చేస్తుండడం వల్ల ‘శక్తి’ తెచ్చిన నష్టాల నుండి బయటపడ్డానని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.

ఆ రియల్‌ ఎస్టేట్ వ్యాపారమే లేకపోతే నేను ఎప్పుడో హైదరాబాద్‌ వదిలి అన్నీ సర్దుకుని విజయవాడ వెళ్ళిపోయేవాడినని కూడా అన్నారు.అటు తర్వాత ”శక్తి’ దెబ్బకు ఇక సినిమాల నిర్మాణం జోలికి పోకూడదు అనుకున్న టైం లో నాగ్ అశ్విన్ వచ్చాడు. అతను వచ్చాక ‘మహానటి’ ‘మహర్షి’ వంటి సినిమాల వల్ల లబ్ది పొందినట్టు అశ్వినీదత్ తెలిపారు. నాని, నాగార్జునలతో చేసిన ‘దేవ దాస్’ ఫలితం తేడా కొట్టినా ఆ సినిమా వల్ల తనకి నష్టాలు రాలేదని అశ్వినీదత్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus