నిర్మాత గారి భాగోతం..అటు సినిమా పోయింది, ఇటు పోలీస్ కేసు

చేసింది తక్కువ సినిమాలే. అయినప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్స్ (Star Producer) లిస్ట్ లో చేరిపోయాడతను. ఇతని గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వాలంటే.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్..గా కెరీర్ ను ప్రారంభించాడు. అతను తీసుకున్న చాలా వరకు సినిమాలు బాగానే ఆడాయి. ఎన్నారై..ల ఎంకరేజ్మెంట్ కూడా ఉండటంతో నిర్మాతగా మారి ఓ సినిమా తీశాడు. దాన్ని ఓ పెద్ద సినిమాపై వేశాడు. మొదటి నుండి సింపతీ వగైరా ఫ్యాక్టర్స్ కలిసి రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. పెట్టిన దానికి పది రెట్లు అన్నట్టు లాభాలు వచ్చాయి.

Star Producer

అయితే రెండో సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇటీవల డిస్ట్రిబ్యూటర్ గా ఓ పెద్ద సినిమాని.. భారీ రేటుకి కొనుగోలు చేసి విడుదల చేస్తే, అది కూడా దారుణంగా ప్లాప్ అయ్యింది. నష్టాలూ కూడా భారీగా వచ్చాయి. దీంతో అతను నిర్మించాలనుకున్న సినిమాలు కొన్ని వదిలేసుకున్నాడు. మరోపక్క ఇతను ఓ నటితో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకున్నాడట. అంతేకాదు ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేశాడు. విషయం అంతవరకు వెళ్లడంతో ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ నిర్మాత .

అయితే ఆ నటికి ఈ విషయం తెలియడంతో ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో సినీ పెద్దలు కొంతమంది ఈమెను కూల్ చేసి నిర్మాతతో (Star Producer) మాట్లాడి సెటిల్ చేద్దామని రాజీ కోసం చూశారట. ఈ క్రమంలో ఆమె రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. అందుకు అతను ఒప్పుకోలేదు. రూ.3 కోట్లకి ఓకే అన్నాడట. అందుకు ఈమె ఒప్పుకోలేదు. ఫైనల్ గా ఓ మాట అనుకుందామనే సరికి ఈ నిర్మాత ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదట. తర్వాత ఆరా తీస్తే విదేశాల్లో ఉన్నాడని తేలింది.

దీంతో ఈ నటికి కోపం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అవసరమైతే తనకు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోమని కచ్చితంగా చెబుతుందట. దీంతో ఆ నిర్మాతపై కేసు కూడా ఫైల్ అయ్యింది. అతను విదేశాల్లో నుండి ఇండియాకి వస్తున్నాడు అని తెలిస్తే పోలీసులు.. ఎయిర్పోర్టులోనే ఆ నిర్మాతని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారట. కాబట్టి..ఆ నిర్మాత సెటిల్మెంట్ చేసుకున్న తర్వాతే ఇండియాకి రావాలి..! అతని కొత్త సినిమా ఓపెనింగ్ ఉంది కాబట్టి.. అతను కచ్చితంగా ఇండియాకి రావాలి. ఈ క్రమంలో ఏం జరుగుతుందా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది

 జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ వెనుక ఇంత కథ నడిచిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus