Janhvi Kapoor: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ వెనుక ఇంత కథ నడిచిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్  (Janhvi Kapoor) దేవర (Devara) సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా రిలీజ్ కాకముందే జాన్వీ కపూర్ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana)  కాంబో మూవీలో సైతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో సైతం జాన్వీ కపూర్ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి కరణ్ జోహార్ (Karan Johar) కారణమని సమాచారం అందుతోంది.

Janhvi Kapoor

కరణ్ జోహార్ సలహాలు, సూచనలు జాన్వీ కపూర్ కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర భాషల్లో సైతం జాన్వీ కపూర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జాన్వీ కపూర్ ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా దేవర సినిమా బిజినెస్ పరంగా కూడా టాప్ మూవీ అనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇకపై ఏ మాత్రం కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా వార్2 సినిమాలో తారక్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల ప్రమోషన్స్ విషయంలో సైతం అదరగొడుతున్నారు.

 ‘దేవర’లో మోస్ట్‌ హైప్డ్‌ సీన్‌.. ట్రైలర్‌లో చూపించిన సీనేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus