త్రీడీ సినిమా అంటే ఒకప్పుడు మనకు బొమ్మల సినిమాలే. అవి కూడా నాసిరకంగా ఉండేవి అని అంటుంటారు. ఇప్పటి తరానికి ఆ సినిమాల సంగతి పెద్దగా తెలియదు లెండి. అయితే నేటి తరానికి తెలుగులో త్రీడీ సినిమాలు అంటే చాలా తక్కువ వినిపిస్తాయి. అందులో గుణశేఖర్ తీసిన సినిమాలు పక్కపెడితే కనిపించే సినిమా ‘యాక్షన్ త్రీడీ’. నిర్మాత అనిల్ సుంకర దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఎందుకు అంటారా? ఆ సినిమా తీసినాయన మళ్లీ మరో సినిమా తీస్తాను అంటున్నారు కాబట్టి.
అవును మీరు చదివింది నిజమే.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత, ‘యాక్షన్’ సినిమా తెరకెక్కించిన అనిల్ సుంకర ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటిన విషయం తెలిసిందే. 2003లో జూన్ 21న ఆ సినిమా రిలీజ్ చేశారు. అయితే ‘ఏజెంట్’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. త్వరలో మళ్లీ దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయి అని చెప్పారు. అంతే కాదు ఆ సినిమా ఏ జోనర్‌లో ఉండొచ్చు అనేది కూడా తెలిపారు.
‘ఏజెంట్’ సినిమా తరహాలోనే స్పై జోనర్ సినిమాను తెరకెక్కిద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. సినిమా ఏ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది విషయం చెప్పకపోయినా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీదే ఉంటుందని చెప్పేయొచ్చు. అయితే తొలి సినిమా ఫలితం తెలిసిన వాళ్లు మాత్రం మళ్లీ డైరక్షనా అని అంటున్నారు. తొలి సినిమానే ఓ ఫారిన్ సినిమాకు రీమేక్.
దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక (Star Producer) అనిల్ ఇబ్బందిపడ్డారు అని చెప్పొచ్చు. కథనం నుండి త్రీడీ వరకు అన్నీ తేడా కొట్టాయి. అల్లరి నరేశ్, సామ్, వైభవ్, రాజు సుందరం తదితరులు నటించిన ఆ సినిమాకు బప్పీ లహరి, బప్పా లహరి సంగీతం అందించారు. భారీ అంచనాలతో వచ్చిన సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?