షాకింగ్ : పారితోషికాలు కూడా ఎగ్గొట్టి మరీ…బయటపడ్డ నిర్మాత చీప్ బుద్ధులు..!

ఒకప్పుడు చిన్న సినిమా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆ సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు, దర్శకులు.. చాలా కష్టాలు పడేవారు. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ సంస్థలు చాలా చిన్న సినిమాలకు మోక్షం కలిగించాయి. మేకింగ్ కాస్ట్ కు 5 రెట్లు చెల్లించి చిన్న సినిమాల హక్కులను ఓటీటీ సంస్థలు దక్కించుకున్న రోజులు కూడా నడిచాయి. అయితే లాక్ డౌన్ ముగిశాక పరిస్థితి మారిపోయింది. ఓ చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలు చాలా ఆరాలు తీస్తున్నాయి.

పైగా చిన్న సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వాలి అనే కండిషన్లు కూడా పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. అంతేకాకుండా సినిమా క్వాలిటీ ఎలా ఉంది అనే విషయం పై ఒకటికి రెండు సార్లు ఆ సినిమాని చూసి క్లారిటీ తెచ్చుకుని కానీ డీల్.. ఫైనల్ చేయడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ నిర్మాత చాలా కక్కుర్తి వేషాలు వేస్తున్నాడు ఇండస్ట్రీ టాక్. ఆ నిర్మాత రూ.10 లక్షల్లో ఓ సినిమా తీశాడు. ఇంట్రెస్ట్ లు అన్నీ కలుపుకుని రూ.15 లక్షల వరకు అయ్యుంటుంది అని ఇన్సైడ్ టాక్. అయితే అతను ఆ సినిమాని రూ.1.5 కోట్ల బడ్జెట్ లో తీశానని రూ.2 కోట్లు అయితేనే ఆ సినిమాని అమ్ముతానని చెబుతున్నాడట.

సరే అది అతని ఇష్టం అని అనుకుని అంతా సరిపెట్టుకోవచ్చు. కానీ డైరెక్టర్ కు, నటీనటులకు,టెక్నీషియన్లకు ఆ నిర్మాత పారితోషికాలు చెల్లించలేదట. ఎప్పటికప్పుడు సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మాక చెల్లిస్తాను అని చెబుతున్నాడట. కానీ ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో డైరెక్టర్ తో సహా విసిగిపోయిన నటీనటులు, టెక్నీషియన్లు మీడియా ముందుకు రావడానికి రెడీ అయ్యారని సమాచారం. ఆ నిర్మాత పేరు ఎమ్.వై. మహర్షి. ఇతను తీసిన సినిమా ‘1948 – అఖండ భారత్’. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కరోజుకే వాషౌట్ అయిపోయింది.

ఇతను ఈ సినిమా హక్కులను అన్ని భాషల్లోనూ కలుపుకుని రూ.2 కోట్లకు అమ్మడానికి రెడీ అయ్యాడు. కానీ డిజిటల్ సంస్థలు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ‘క్వాలిటీ లెస్ కెమెరాలతో ఈ సినిమా తీశారు, ఇంత ఇవ్వడం కుదరదు’ అని డిజిటల్ సంస్థలు ‘ఈ సినిమా మాకు వద్దు’ అని తిప్పికొడుతున్నాయి. అయినా సరే కంటెంట్ బాగుంది వ్యూయర్ షిప్ బేస్ పై స్ట్రీమింగ్ చేయడానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందట. ముందుగా రూ.25 లక్షల నుండి రూ.30 లక్షల వరకు చెల్లిస్తామని ఆఫర్ చేసిందట.

కానీ ఈ నిర్మాత రూ.70 లక్షలు చెల్లిస్తే హక్కులు ఇస్తాను అని ఆ డిజిటల్ సంస్థకు కండిషన్లు పెడుతున్నాడట.దీంతో ఆ సంస్థ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నిర్మాత స్వతహాగా ఆస్థిపరుడే. కానీ పారితోషికాలు కూడా ఇవ్వకుండా బిజినెస్ చేసి ఆ అమౌంట్ సెటిల్ చేయాలని చూస్తున్నాడట. ఇవేం చీప్ బుద్దులో ఏమో అంటూ నటీనటులు, టెక్నీషియన్లు మండిపడుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus