RRR Movie: ఇండియన్ సినిమాకి ఆస్కార్ తీసుకొచ్చిన సినిమా చూసే టైం లేదంటున్న స్టార్ హీరోయిన్

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. దాదాపు రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా.. ఈ చిత్రంలోనే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ కూడా లభించింది. ఆస్కార్ వేదిక పై తెలుగు వాళ్ళు ఉండటం అనేది మామూలు విషయం కాదు.

టైటానిక్, అవతార్ , అవతార్ 2 వంటి చిత్రాలను తెరకెక్కించిన జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళి పనితనాన్ని పొగిడేశాడు. రాంచరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. అన్ని భాషల్లోని ముఖ్యమంత్రులు అలాగే ప్రధాన మంత్రి కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించింది. జపాన్ లో అయితే ఈ మూవీ ఇప్పటికీ ఆడుతుంది. అక్కడ 365 రోజులు ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఓ స్టార్ హీరోయిన్ చూడలేదట.

అందులో తప్పేమీ లేదు. కానీ ఆ సినిమాని చూసేందుకు టైం కూడా లేదు అంటుంది ఆ స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్నాక గ్లోబల్ హీరోయిన్ అయ్యింది. ఈ మధ్యనే ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie)  చిత్రం గురించి ప్రశ్న ఎదురైతే ‘నేను ‘ఆర్.ఆర్.ఆర్’ చూడలేదు.

చూసేంత టైం కూడా నాకు లేదు. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. అయినా నేను సినిమాలు ఎక్కువ చూడను. టీవీ షోలు మాత్రమే చూస్తాను’ అంటూ ఈమె జవాబిచ్చింది. ఇండియన్ సినిమాకి ఆస్కార్ తీసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని వీక్షించే సమయం ప్రియాంక చోప్రాకి లేదట. ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ రావడంపై చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ జనాలు అయితే మరీను. ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయినే కదా. అది అసలు మేటర్.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus