Singer Mangli: సింగర్ మంగ్లీ కారుకి యాక్సిడెంట్.. ఏమైందంటే?

సింగర్ మంగ్లీ (Mangli) అందరికీ తెలుసు కదా.. తెలంగాణ పాటలతో పాపులర్ అయిన ఈమె .. ఆ తర్వాత సినిమాల్లో మాస్ పాటలు పాడే ఛాన్సులు దక్కించుకుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడింది మంగ్లీ. సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి కదా అని వాటికే ఆమె పరిమితం అయిపోకుండా ఫోక్ సాంగ్స్ , స్పెషల్ సాంగ్స్ కూడా పాడుతూ వస్తుంది. ఏదైనా పండుగ వస్తుంది అంటే మంగ్లీ పాడే భక్తి పాటలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

మరోపక్క టీవీ షోల్లో కూడా మెంటర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమెను సూపర్ సింగర్ వంటి షోలలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా… తాజాగా మంగ్లీ యాక్సిడెంట్ పాలైంది. విషయం ఏంటంటే సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈమె ఓ షోని ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగర్ మంగ్లీ అభిమానులని ఇది కలవరపెట్టే అంశమే అయినప్పటికీ..

ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదం నుండి ఆమె బయటపడిందని పోలీసులు తెలియజేశారు. వారి సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఉత్సవాలకు సింగర్ మంగ్లీ గెస్ట్ గా వెళ్లడం జరిగింది.

ఆ కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి ఇంటికి వస్తున్న టైంలో శంషాబాద్ మండలం తోడుపల్లి వంతెన వద్ద కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఒక డీసీఎం వెనుక నుంచి వేగంగా వచ్చి మంగ్లీ కారుని ఢీ కొట్టడం జరిగింది. అయితే పెద్ద ప్రమాదం ఏమీ కాలేదు ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి అని తెలుస్తుంది. ఆ డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus