సినీ పరిశ్రమలో రోజు రోజుకూ విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కమెడియన్ అల్లు రమేశ్ మరణించి మూడు రోజులు కూడా కాకుండానే మరో సింగర్ మరణించడం అందరికీ షాకిచ్చే అంశం. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే.. ఆ సింగర్ కు నిండా పాతికేళ్ళు కూడా లేకపోవడం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ అలాగే నటుడు అయిన మూన్ బిన్ అతని నివాసంలో చనిపోయి ప్రత్యక్షమయ్యాడు. దక్షిణ కొరియా సియోల్లో ఉన్న మూన్ బిన్ నివాసంలో..
చనిపోయి ఉన్న (Star Singer) అతని మృతదేహాన్ని మేనేజర్ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మూన్ బిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ASTRO బ్యాండ్ సభ్యుడైన మూన్ బిన్.. బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, ది మెర్మెయిడ్ ప్రిన్స్ వంటి పలు కొరియన్ డ్రామాల్లోనూ నటించాడు. తెలుగు ప్రేక్షకులు కూడా బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్ సిరీస్ ను తెగ చూసారు. ఆరడుగుల మూన్ బిన్ ఫోటోని చాలా మంది స్క్రీన్ షాట్ గా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
భాషతో సంబంధంలేకుండా అతని పాటలు విని ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉన్నారు. అలాంటి వారికి మూన్ బిన్ మరణవార్త డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది. నిన్న రాత్రి అంటే తెల్లవారితో గురువారం అనగా అతను మరణించినట్టు స్పష్టమవుతుంది. మూన్ బిన్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన పనేముంది. అంతలా అతను అనుభవించిన మనోవేదన ఏంటి అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!