Star Singer: భర్త లేకుండానే ఆ పని చేసిన సింగర్!

తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకుందీ బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ నేహా కక్కర్‌. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్‌ సింగర్‌ రోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే వారిద్దరూ తెలిపారు. వీరి పెళ్లిలో టాప్ సెలబ్రిటీలంతా చేరి సందడి చేశారు.

పెళ్లి బట్టల దగ్గర నుంచి వేదిక దాకా అన్నింటిపైనా నెట్టింట చర్చ జరిగింది. ఇదంతా పక్కన పెడితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నేహా కక్కర్ తన 35వ పుట్టినరోజు బాష్‌ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్‌డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె భర్త తప్ప స్నేహితులు, బంధువులంతా ఉండటంతో నెటిజన్లలో డౌట్ మొదలైంది.

దీంతో మీరిద్దరూ విడిపోయారా? అంటూ డైరెక్ట్గానే ఈ సింగర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై రోహన్ కూడా నోరు మెదపకపోవడంతో నిజంగానే వీరి మధ్య విబేధాలున్నాయని అనుకుంటున్నారు. దీంతో బాలీవుడ్‌లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. మరి ఈ రూమర్లు ఆగాలంటే వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.

నేహా కక్కర్ (Singer) చాలా ప్రజాదరణ పొందిన పాప్ సంగీత విద్వాంసురాలు. ఆమె కిట్టిలో కాలా చష్మా, కర్ గయీ చుల్, సన్నీ సన్నీ, లండన్ తుమక్డా మరియు అనేక ఇతర పాటలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ జవానీ, లండన్ తుమక్డా, కర్ గయీ చుల్, బద్రీ కి దుల్హనియా, ఛీజ్ బడి, దిల్బార్ ఆంఖ్ మారే, కోకా కోలా, ఓ సాకి సాకి, ఏక్ తో కమ్ జిందగాని వంటి అనేక హిట్‌ పాటలు పాడారు నేహా కక్కర్‌.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus