మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కెరియర్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘అంతరిక్షం’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు.
ఈ డిసెంబర్ 24 కు వరుణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ‘ముకుంద’ చిత్రం 2014 డిసెంబర్ 24 న విడుదలయ్యింది. తొలి చిత్రంతోనే మంచి నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ హిట్ సాధించలేకపోయాడు. తరువాత వచ్చిన ‘కంచె’ చిత్రం కూడా యావరేజ్ ఫలితాన్నే ఇచ్చింది. కానీ ‘ధూపాటి హరిబాబు’ పాత్రకి వరుణ్ ప్రాణం పోసాడని చెప్పడంలో సందేహం లేదు. ఇక తరువాత మాస్ ను మెప్పించే పనిలో ‘లోఫర్’ చేసి డిజాస్టర్ మూటకట్టున్నప్పటికీ ‘మాస్’ పాత్రలకి తానేం తీసిపోనని నిరూపించుకున్నాడు. ఇక తరువాత వచ్చిన ‘మిస్టర్’ కూడా డిసాస్టర్ అయినప్పటికీ అది డైరెక్టర్ శ్రీను వైట్ల అకౌంట్లో కొట్టుకుపోకొట్టుకుపోయింది. అయినా నిరుత్సాహ పడకుండా ‘ఫిదా’ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంతో యూత్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. సాధారణంగా ఒక పెద్ద హిట్ సాధించిన తరువాత ఏ హీరో అయినా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో తడబడుతుంటాడు. అయితే వరుణ్ ఏమాత్రం కంగారు పడకుండా ‘తొలిప్రేమ’ చిత్రంతో మరో సూపర్ హిట్ ను తన కాతాలో వేసుకున్నాడు.
రెండు హిట్లు వచ్చాయి కదా అని వెంటనే మాస్ బాట పట్టకుండా మరోసారి ‘అంతరిక్షం’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’ కూడా సంక్రాంతికి విడుదలవుతుంది. ఇక ఈ రెండు చిత్రాలు హిట్టయితే వరుణ్ కి స్టార్ ఇమేజ్ దక్కినట్టే అనడంలో సందేహం లేదు.