బాలయ్య పై స్టార్ రైటర్ చేసిన కామెంట్స్ వైరల్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇదే ఏడాది మే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.గతంలో బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్టే గతేడాది బాలయ్య పుట్టినరోజు నాడు ఈ చిత్రం నుండీ విడుదల చేసిన గ్లింప్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘క్రాక్’ దర్శకుడితో బాలయ్య సినిమా ఉండబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది.

‘మైత్రి మూవీ మేకర్స్’ లో ఈ ప్రాజెక్టు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బాలయ్యతో సినిమా చెయ్యాలని సీనియర్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఈయన కూడా గతంలో బాలయ్యకి ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడే. అయితే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం ఫలితం వీరిద్దరినీ కలవనివ్వకుండా చేస్తూ వచ్చింది. అయితే వీరి కాంబోలో సినిమా ఉంటుంది అని వార్తలు మొదలవ్వగానే అభిమానులు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే వీటిని ఖండించారు ఆ ప్రాజెక్టుకి కథ మరియు మాటలు అందిస్తున్న రైటర్ బుర్రా సాయి మాధవ్.బాలకృష్ణగారితో సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నారాయన.

‘బాలకృష్ణ గారి కెరీర్‌ ను తీసుకుంటే..ఆయన చేసిన వాటిలో ఎమోషనల్ డ్రామాతో వచ్చిన యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.సెంటిమెంట్ తో వచ్చే ఎమోషన్ అంటే.. మనకి బాలకృష్ణ గారే గుర్తొస్తారు. ఆయనంటేనే సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్. ఈ మూడింటినీ సమానంగా ధట్టించి సినిమా చేస్తే నందమూరి అభిమానులే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు నేను ఆయన కోసం రెడీ చేస్తున్న కథ కూడా అలాంటిదే.స్క్రిప్ట్ చాలా బాగా వస్తుంది. డౌట్ పడాల్సిన అవసరం లేదు’ అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు బుర్రా సాయి మాధవ్.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus