బాహుబలి సినిమాలో రాజమౌళి ప్రతి పాత్రను శిల్పం చెక్కినట్లు చెక్కారు. ఎత్తు, లావు, బరువు, మాట తీరు, మనసు స్వభావం.. నడక, నడవడిక.. ఇలా ఒకటేమిటీ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అంతెందుకు ఆ క్యారెక్టర్స్ నుదుటిన పెట్టుకునేబొట్టు వెనకాల ఓ స్టోరీ ఉంది. అది ఏమిటంటే..
శివగామిశివగామి నిండు చంద్రుడు బొట్టుని పెట్టుకొని ఉంటుంది. ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు ఆ బొట్టు నిదర్శనం.
అమరేంద్ర బాహుబలిప్రజల పట్ల జాలి, కరుణ చూపించేందుకు గుర్తుగా సగం చంద్రుడి బొట్టు పెట్టుకున్నారు.
మహేంద్ర బాహుబలిశివుడు పాత్రకు పెట్టిన బొట్టుకు అత్యంత బలవంతుడని అర్ధం.
దేవసేనలింగ వివక్షకు వ్యతిరేకమైన రధం వచ్చేలా దేవసేన బొట్టు పెట్టుకుంది. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ఆ బొట్టు తెలుపుతుంది.
భల్లాల దేవసూర్యుడు బొట్టుతో ఉంటారు. అంటే సింహాసనం కోసం పరితపించేవాడని అర్ధం.
బిజ్జలదేవబిజ్జల దేవ త్రిసూళం బొట్టుతో కనిపిస్తారు. అంటే ఇక్కడ మంచి లక్షణాలు కాదు. మూడు చెడు లక్షణాలు కలిగిన వ్యక్తి అని అర్ధం. మోసం, అసూయ, ద్వేషం కలిగిన వ్యక్తి అని సూచిస్తుంది.
కట్టప్పకట్టప్ప పెట్టుకున్న బొట్టుకు కట్టు బానిస అని అర్ధం.
అవంతికఅవంతిక పెట్టుకున్న బొట్టుకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయుధంగా మారిన మహిళా అని అర్ధం వస్తుంది.