వెండితెరపై ఫ్యాక్షనిస్ట్ అంటే జయప్రకాష్ రెడ్డి గుర్తుకు రావలసిందే. కరుడుగట్టిన ఫ్యాక్టనిస్తుగా జేపీ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. భారీ ఖాయం, గంభీరమైన స్వరం, నిప్పులు చెరిగే ఆ కళ్ళతో, రాయలసీమ యాసలో ఆయన వెండితెరపై పండించే విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేసేవారు. 1997లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేమించుకుందాం రా మూవీలో మొదటిసారి జేపీ ఫ్యాక్షనిస్ట్ పాత్ర చేశారు.
కన్నకూతురిని పరువుగా భావించే ఫ్యాక్టనిస్ట్ గా జయప్రకాశ్ నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఆ తరువాత 1999లో బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి మూవీ జేపీకి నటుడిగా బిగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. సమరసింహారెడ్డి మూవీ ఇండస్ట్రీ కొట్టగా పగ కోసం కన్నకూతురిని కూడా చెంపేసే ఫ్యాక్షనిస్ట్ గా జేపీ యాక్టింగ్ నభూతో నభవిష్యత్ అనాలి.
వీరరాఘవ రెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ పాత్రలో జేపీ నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.ఆ తరువాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన నరసింహనాయడు, సీమ సింహం, చెన్నకేశవరెడ్డి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో జేపీ ఫ్యాక్షనిస్ట్ రోల్ చేశాడు.