‘ఖడ్గం’ ‘అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి’ వంటి చిత్రాలతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుబ్బరాజు. మొదటి రెండు సినిమాల తోనే మంచి నటుడు అనిపించుకున్న సుబ్బరాజు… హీరోలను మించే కటౌట్ ఉన్నప్పటికీ… హీరో మెటీరియల్ అనిపించుకునే సినిమాలు చెయ్యలేకపోయాడు. అయితే ‘ఆర్య’ ‘నేనింతే’ ‘పోకిరి’ ‘పప్పు’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మిర్చి’ ‘బాహుబలి 2’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో సంపూర్ణ నటుడు అనిపించుకున్నాడు. ఇలా సినిమాల్లో ఇప్పటికీ సహాయ నటుడుగా రాణిస్తున్న సుబ్బరాజు… 43 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు.
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటుతుంది.. బాగానే సెటిల్ అయ్యాడు అయినా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు.. అనే ప్రశ్నలకు చాలా గమ్మత్తయిన ఆన్సర్ ఇచ్చాడు సుబ్బరాజు. సుబ్బరాజు మాట్లాడుతూ…”పెళ్ళి చేసుకోవాలంటే కేవలం వయసుంటే సరిపోదు. 25ఏళ్ళ వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అందరికీ ఉంటుంది.కానీ నేను కూడా అలా చేసుకోవాలి అనుకోలేదు… అనుకోవడం లేదు. నన్ను పెళ్ళి చేసుకునే అమ్మాయికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను… అని నాకు అనిపించినప్పుడే పెళ్ళి చేసుకుంటాను.
ఇప్పుడైతే అలా అనుకోవడం లేదు. ఇంకా అలా అనిపించలేదు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సుబ్బరాజు చేసిన ఈ కామెంట్స్ కు నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘మీ పై అభిమనం.. ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది సుబ్బరాజు గారు’.. అని కొందరు అంటుంటే… ‘అయితే ఇప్పుడు నేను పెళ్ళికి వేస్ట్’ అని అంటున్నావు అంతేనా అంటూ విమర్శతో కూడిన కామెంట్స్ కూడా చేస్తున్నారు.