Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!
- May 19, 2025 / 03:40 PM ISTByPhani Kumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాతగా మారి ‘శుభం’ (Subham) అనే ఓ చిన్న సినిమాని రూపొందించింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యింది. సీరియల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని దాని చుట్టూ అల్లిన కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కు కొత్త ఫీలింగ్ ఇచ్చాయి. గవిరెడ్డి శ్రీనివాస వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.
Subham Collections:

6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి మొదటి వారం పర్వాలేదు అనిపించింది. 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.02 cr |
| సీడెడ్ | 0.28 cr |
| ఉత్తరాంధ్ర | 1.09 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.39 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.31 cr |
| ఓవర్సీస్ | 0.60 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 3.30 cr (షేర్) |
‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమా రూ.3.3 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.42 కోట్లు కలెక్ట్ చేసింది.













