కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. ఎపిసోడ్ ప్రారంభంలోనే కావ్య రాజ్ తో మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం తర్వాత తనపై అక్షింతలు వేసే ఆశీర్వదించకపోవడంతో తనతో గొడవపడుతుంది. ఇన్ని రోజుల నుంచి ఇన్ని అవమానాలు బాధలు పడుతున్న మీరు కట్టిన తాళికి విలువ ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను. దాంతో రాజ్ నా ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోయాయి అనడంతో కావ్య ఈ ప్రపంచంలో ఎంతమంది ఇష్టం లేనటువంటి పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సంతోషంగా ఉంటూ పిల్లల్ని కంటున్నారు.
అయినా బ్రహ్మముడిని కూడా ఎదిరించే ధైర్యం మీకు ఉందని తెలిసాక నేను ఇక్కడ ఉండటం అనవసరం నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటూ కావ్య మాట్లాడుతుంది. ఆ సమయంలో సీతారామయ్య మెట్లు దిగుతూ ఉండగా తాను కావ్య రాజ్ మాట్లాడే మాటలను వింటారు దీంతో బాధపడుతూ దిగుతున్నటువంటి ఆయన ఒక్కసారిగా మెట్లపై పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా బయటకు వస్తారు. దీంతో సుభాష్,రాజ్ ఇద్దరు కూడా సీతారామయ్యను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్లు తనని పరిశీలించిన తర్వాత డాక్టర్ మాట్లాడుతూ తన తాతయ్యకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.
తను ఇక మూడు నెలలకు మినహా ఎక్కువ కాలం బ్రతకరని చెప్పగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఉంది కదా అని అడగడంతో ఉంది కానీ ట్రీట్మెంట్ కి సహకరించే వయసు మీ తాతయ్య గారికి లేదు అంటూ డాక్టర్ చెప్పగా సుభాష్ తన తండ్రి పరిస్థితి తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక తన తండ్రి ఏడుస్తూ ఉండగా రాజ్ అక్కడికి వచ్చి తాతయ్య గురించి ఎవరికి ఏమి చెప్పకండి నాన్న మీరే ఇలా అయితే ఇక ఇంట్లో ఎవరు తట్టుకోలేరు ఎవరికీ ఈ విషయం చెప్పద్దు అంటూ రాజ్ మాట్లాడతారు తాతయ్య బ్రతికినంత కాలం తనని సంతోషంగా ఉండేలా చూద్దామని తనని ఇంటికి తీసుకువెళ్తారు.
ఇంటికి వెళ్ళగానే చిట్టి సీతారామయ్యను చూసి ఏడుస్తూ ఏమైందని అడుగుతుంది మరేం కంగారు పడాల్సిన పనిలేదు కళ్ళు తిరిగి పడిపోయారు అంతే అని చెబుతూ తనని తన గదిలోకి తీసుకెళ్తారు. మరోవైపు కావ్య తన గదిలో ఉండగా నువ్వు ఇంకా వెళ్లలేదా అంటూ రాజ్ మాట్లాడతారు. వెళ్దామని అనుకున్నాను కానీ తాతయ్య పరిస్థితి చూసి ఆగిపోయాను అనడంతో ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావా అంటూ మాట్లాడటంతో కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెబుతుంది అంతలోపు సీతారామయ్య రాజ్ ను పిలిపిస్తారు.
రాజ్ తన తాతయ్య దగ్గరకు వెళ్లడంతో నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను అని మాట్లాడగా రాజు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు తాతయ్య మీరు అనడంతో నేను డాక్టర్ చెప్పినదంతా విన్నాను. నేను చనిపోతున్నాను అంటే నాకు పెద్దగా బాధ ఏమీ లేదు నా బాధ మొత్తం నీ కాపురం పైనే నువ్వు కావ్య మంచిగా ఉండాలనేది నా కోరిక అంటూ మాట్లాడుతారు. ఇక నేను ఇక్కడ కాదు ఉండాల్సింది నన్ను హాల్లోకి తీసుకొని వెళ్ళు అంటూ మాట్లాడుతారు.
మరోవైపు కావ్య వద్దకు వెళ్లి ఇన్ని రోజులు భరించాను మరో మూడు నెలలు ఓపిక పట్టు మూడు నెలల వరకు ఇక్కడే ఉండు అనడంతో కావ్య సంతోషపడుతుంది అనంతరం కృష్ణుడి వద్దకు వెళ్లి నేను ఈ మూడు నెలలు ఓపిక పడితే ఇక ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు నాకు ఆయన మనసులో స్థానం దక్కేలా చూడు అంటూ కావ్య కృష్ణయ్యను వేడుకుంటుంది. మరోవైపు రాజ్ కావ్యకు ఎప్పటికీ నా మనసులో స్థానం ఉండదు అంటూ మాట్లాడుతారు.