‘ఆర్ఆర్ఆర్’ గురించి ఏ చిన్న విషయం బయటికొచ్చినా… అది అద్భుతం అయిపోతోంది. అలాంటిది అద్భుతమే బయటికొస్తే… ఇంకేమవుతుంది.. అత్యద్భుతం అవుతుంది. తాజాగా సినిమా బృందం విడుదల చేసిన ‘కొమురం భీముడో…’ పాట మీరు వినే ఉంటారు. చూసి కూడా ఉంటారు. ఆ పాట ‘కొమురం భీమ్’ గురించి పూస గుచ్చినట్లు వివరిస్తుంది. అంతటి చక్కటి పాటను రచించిన వారు సుద్దాల అశోక్ తేజ. మరి ఆ పాట గురించి ఆయననే అడిగితే చాలా విషయాలు తెలుస్తాయి. ఆ ప్రయత్నమే ఇది.
కొమురం భీమ్‌ని ఆంగ్లేయులు చిత్రహింసలు పెడుతున్నప్పుడు… వాటికి భయపడి లొంగిపోతే వీరుడు ఎలా అవుతాడు? అడవి తల్లి బిడ్డవి ఎలా అవుతాడు? అనేది తెలిపేలా పాట సాగుతుంది. ఆంగ్లేయలు.. భీమ్‌ను హింసిస్తుంటే… తనకు తాను ధైర్యం తెచ్చుకునే పాటగా సుద్దాల అశోక్‌తేజ రాశారు. అడవి వీరుల ధైర్యాన్ని, వారసత్వాన్ని, కొమురం భీమ్ నేపథ్యాన్ని, అతని ధీరోధాత్తమైన జీవితాన్ని పాటలో చెప్పే ప్రయత్నం చేశారు సుద్దాల. ‘పరమవీరచక్ర’లో కొమురం భీమ్ మీద…
ఎనిమిది నిమిషాల కథని గతంలో గేయ రూపకంలో రాశారు సుద్దాల అశోక్ తేజ. ‘కొమురం భీమ్’ సీరియల్‌కి కూడా ఓ పాట రాశారాయన. మూడో సారి ఆయన రాసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసమే. ఈ సినిమా పాట కోసం దర్శకుడు రాజమౌళి చెబుతూ… భీముడి వ్యక్తిత్వంతోపాటు, తెలంగాణ సంస్కృతిలోని పదాలు పాటలో కావాలన్నారట. దీంతో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే భాషతోనే పాట రాశారట ఆయన. ఈ పాటను సుద్దాల రెండు రోజుల్లో పూర్తి చేశారట.
ఆ తర్వాత ఎనిమిది రోజులపాటు కీరవాణి, రాజమౌళితో చర్చించుకుంటూ… మరో మూడు పాటల్ని పూర్తి చేశారట. ఈ పాట ఆలపించడానికి ఎస్పీ బాలు అయితే బాగుండేదనుకున్నాను. కాలభైరవ పాటను గొప్పగా పాడాడు. బాలు ఉండి ఉంటే… ఈ పాట విని కౌగిలించుకునేంత పని చేసేవారు. ఈ పాటలో వాడిన పదాలలో తుడుము అనేది గోండు ప్రజలకు తెలిసిన మాట. వారు వాయించే వాయిద్యం పేరు అది. అది తప్ప తప్ప మిగతాదంతా తెలంగాణ గ్రామీణ భాషే.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!